For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుబాయి స్టేడియంలో రామ్ చరణ్... (ఫొటోలు)

By Srikanya
|

హైదరాబాద్ : సినిమా రంగంలో అసాధార‌ణ విజ‌యాలు సాధించి, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను అందుకుంటూ.. యంగ్ జనరేషన్ కు స్ఫూర్తినిచ్చే యువ‌త‌రానికి మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ ఆసియా విజన్ -2016 పేరిట యూత్ ఐక‌న్‌ పుర‌స్కారాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈసారి క‌మిటీ టాలీవుడ్ నుంచి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారానికి ఎంపిక చేసుకోవ‌డం విశేషం. త‌న‌దైన ఛ‌రిష్మాతో వెండితెరపై వెలుగులు విర‌జిమ్ముతున్న స్టార్‌ హీరో చ‌ర‌ణ్‌కి కోట్లాది ప్రేక్ష‌కాభిమానుల ఫాలోయింగ్ ఉంది. యువ‌త‌రానికి స్ఫూర్తినిచ్చే అసాధార‌ణ విజ‌యాలు ఈ యువ‌హీరో సొంతం.

త‌న రెండో సినిమా(మ‌గ‌ధీర‌)కే బాక్సాఫీస్ వ‌ద్ద 70 కోట్లు పైగా వ‌సూళ్లు సునాయాసంగా రాబ‌ట్టిన హీరో చ‌ర‌ణ్‌. అందుకే అత‌డి ప్ర‌తిభ‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. ఇటీవ‌ల‌ షార్జా స్టేడియం(యుఏఈ )లో జరిగిన ఆసియా విజన్ -2016 వేడుకల్లో రామ్ చరణ్ కి అత్యున్న‌త యూత్ ఐక‌న్‌ పుర‌స్కారం అందించారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

అప్పటినుంచే

అప్పటినుంచే

దుబాయ్‌లో ప్ర‌తియేటా నిర్వ‌హించే అతి పెద్ద మ‌ల‌యాళ అవార్డుల కార్య‌క్ర‌మం ఇది. 2006 నుంచి ఈ పురస్కారాల్ని అందిస్తున్నారు. అక్కడికి రామ్ చరణ్ వెళ్లి ఈ అవార్డ్ ని అందుకున్నారు.

నిర్మాతగానూ, నటుడుగానూ..

నిర్మాతగానూ, నటుడుగానూ..

ప్రస్తుతం రామ్ చ‌ర‌ణ్ న‌టించిన `ధృవ‌` అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే త‌ను నిర్మిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

గమనించండి

గమనించండి

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ధృవ. సురేందర్‌రెడ్డి దర్శకుడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి. ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజా పరిస్థితుల కారణంగా విడుదల తేదీని వారం పొడిగించి డిసెంబర్ 9కి మార్చారు.

మంచివాడిగా నటిస్తూ..

మంచివాడిగా నటిస్తూ..

నీతి నిజాయితీలకు కట్టుబడే పోలీస్ అధికారి ధృవకు వృత్తి నిర్వహణలో కొందరు శుత్రువులు ఎదురవుతారు. వారు ఎవరు? ధృవ వారిపై ఎలాంటి పోరాటం సాగించాడు? అనేది ఈ చిత్ర ఇతివృత్తం. సమాజంలో మంచివాడిగా చెలామణి అవుతోన్న అవినీతిపరుడిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంలో విజయవంతమైన తని ఒరువన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరవింద్‌స్వామి విలన్‌గా కనిపిస్తారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ..

ఇటీవలే విడుదలైన పాటలకు చక్కటి స్పందన లభిస్తోంది. రామ్‌చరణ్ పాత్ర చిత్రణ శక్తివంతంగా ఉంటుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అరవింద్‌స్వామి, నాజర్, పోసాని కృష్ణమురళి, తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ:పి.యస్.వినోద్, సంగీతం:హిప్, హాప్ తమిళ, ప్రొడక్షన్ డిజైనర్:రాజీవన్, ఆర్ట్:నాగేంద్ర, ఎడిటర్:నవీన్‌నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:వి.వై.ప్రవీణ్‌కుమార్.

English summary
Ram Charan is well known for his ultra stylish dressing sense and impressive attitude. The Bruce Lee star has now received the Youth Icon Award at the Asia Vision Movie Awards 2016. Charan attended the awards ceremony wearing a traditional costume designed by Neeraja Kona. The actor looks perfect in traditional looks.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more