పెళ్లిలో ఫ్యాన్స్‌కి నో ఎంట్రీ....ఇన్విటేషన్లో పేర్కొన్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ నెల 14వ తేదీన ఉపాసనను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన ఫాం హౌస్‌లో ఈ వేడుక జరుగబోతోంది. ఈ వేడుకకు అభిమానులను దూరంగా ఉంచారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అభిమానుల కోసం జూన్ 15న తేదీన ప్రత్యేకమైన ఏర్పట్లు చేశారు. ఈ మేరకు చెర్రీ అభిమానుల కోసం స్పెషల్ ఇన్విటేషన్ పంపారు. అయితే ఇది కేవలం అభిమానులకు మాత్రమే అని స్పష్టం అవుతోంది. మెగా అభిమానుల సంఘంలో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఈ ఇన్విటేషన్లు అందాయి. వాటిపై ప్రత్యేకంగా బార్ కోడ్ కూడా ముద్రించారు. రిసెప్షన్ కు అభిమానులు ఎంటర్ అయ్యే ముందు తమ వద్ద ఉన్న ఇన్విటేషన్ కార్డును ఎలక్ట్రానిక్ మిషన్లో చెక్ చేసి పంపుతారు. ఒక ఇన్విటేషన్‌కి ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని దానిపై స్పష్టంగా పేర్కొనబడి ఉంది.
ఇక రామ్ చరణ్ ఇన్విటేషన్లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి
ప్రియమైన అభిమానులకు మీ రామ్ చరణ్ నమస్సుమాంజలి. 2012 జూన్ 14వ తేదీన నా వివాహం ఉపాసనతో జరుగుతోందన్న సంగతి మీకు తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మీ కోసం ప్రత్యేకించి 2012 జూన్ 15వ తేదీన వివాహ రిసెప్షన్ నిర్వహిస్తున్నాము. మీకు, నాన్నగారితో ఉన్న అనుబంధం నాకు తెలుసు. ఆయన కుమారుడినైన నన్ను కూడా మీ ఆదరాభిమానాలతో ఇంతటి వాణ్ణి చేశారు. అందుకే మీరంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. జూన్ 15వ తేదీన ఉదయం 11:15 నుంచి హిమాయత్ సాగర్‌లోని టెంపుల్ ట్రీస్ నందు కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరిగే వివాహ రిసెప్షన్‌కు మీరు విచ్చేసి మీ శుభాకాంక్షలు అందజేస్తేనే ఈ శుభకార్యం సంపూర్ణం అవుతుంది. కావున మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆహ్వానిస్తారని ఆశిస్తూ ఇదే నా హృదయ పూర్వక ఆహ్వానం.. మీ రాకతో కళ్యాణవేదిక కళకళలాడాలని ఆకాంక్షిస్తూ... మీ రామ్ చరణ్.


Click it and Unblock the Notifications











