»   » నాతో చేస్తానని మాటిచ్చాడు, మల్టీస్టారర్ అనేది రూమరే: రామ్ చరణ్

నాతో చేస్తానని మాటిచ్చాడు, మల్టీస్టారర్ అనేది రూమరే: రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'జంజీర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలోనే భారీ ప్లాపును చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు. అయితేూ రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడని, సింగిల్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు కాబట్టి సల్మాన్ ఖాన్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమాలో చేయబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

సల్మాన్ ఖాన్ సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై రామ్ చరణ్ స్పందించారు. సల్మాన్ ఖాన్ బాలీవుడ్లో నేను చేయబోయే తర్వాతి సినిమాను తన సొంత బేనర్లో ప్రొడ్యూస్ చేస్తానని మాటిచ్చాడు. అయితే స్క్రిప్టు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇప్పటి వరకు నేను ఏ మల్టీ స్టారర్ కు కమిట్ కాలేదు' అన్నారు.

Ram Charan refutes multistarrer rumours

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.....ప్రస్తుతం రామ్ చరణ్...సురేంద్రరెడ్డి దర్శకత్వంలో తని ఒరవన్ చిత్రం చేస్తున్నారు. ధృవ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం తనను బ్రూస్ లీ ప్లాఫ్ నుంచి బయిట పడేస్తుందని భావిస్తున్నాడు. సుకుమార్ తో చేయటం ద్వారా తనకు యుఎస్ లో మార్కెట్ పెరుగుతుందని రామ్ చరణ్ ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు.

త్వరలో సుకుమార్ తో కూడా చరణ్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. యుఎస్ నేపధ్యంగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన యుఎస్ లోనే ఆ లొకేషన్స్ లోనే తిరుగుతూ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. రీసెంట్ చిత్రం నాన్నకు ప్రేమతో...మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా సక్సెస్ ఫుల్ గా భాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. ఈ నేఫధ్యంలో అయనకు తదుపరి చిత్రం రామ్ చరణ్ హీరోగా ఓకే అయ్యింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్ ఒకే సారి విని ..స్టోరీ లైన్ ని ఓకే చేసారని, త్వరలోనే ట్రీట్ మెంట్ వెర్షన్ వారికి వినిపిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

English summary
Actor Ram Charan refuted the rumours about a multistarrer in Hindi with Bollywood’s superstar Salman Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu