twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అద్భుతంగా జరుగుతున్న సమయంలో ఇలా, నేను ఓకే.. గాయంపై స్పందించిన రాంచరణ్!

    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ జోరందుకుంది. ఇటీవల చిత్ర యూనిట్ గుజరాత్‌లోని వడోదరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షెడ్యూల్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో జరగనున్నాయి. పూణే, వడోదర, కోల్ కతా లాంటి నగరాల్లో చరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర లొకేషన్ లో రాంచరణ్ గాయపడిన వార్త అభిమానులని కలవరపెడుతోంది. దీనిపై తాజాగా రాంచరణ్ స్పందించాడు.

    ఆగిపోయిన షూటింగ్

    ఆగిపోయిన షూటింగ్

    ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కోసం రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ సహా చిత్ర యూనిట్ మొత్తం నార్త్ ఇండియాకు వెళ్లారు. రాంచరణ్ జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉండగా కాలి మడమకు గాయమైంది. దీనితో పుణేలో నిర్వహించాల్సిన షెడ్యూల్ మూడు వారాల పాటు వాయిదా పడింది. రాజమౌళి చిత్రాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకు తగ్గట్లుగా జిమ్ లో కసరత్తులు చేస్తుండగా చరణ్ గాయపడ్డాడు.

    స్పందించిన చరణ్

    స్పందించిన చరణ్

    రాంచరణ్ గాయం కావడంపై చిత్ర యూనిట్ ఇప్పటికే స్పందించింది. తాజాగా రాంచరణ్ కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అద్భుతంగా జరుగుతున్న సమయంలో దురదృష్టవ శాత్తూ నాకు గాయమైంది. డాక్టర్లు కొన్ని రోజుల పాటు విశ్రాంతి సూచించారు. నేను బాగానే ఉన్నాయి. మూడు వారాల తర్వాత మళ్ళీ షూటింగ్ మొదలవుతుంది అని రాంచరణ్ తెలిపాడు.

    అల్లూరి సీతారామరాజు

    అల్లూరి సీతారామరాజు

    రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. 1920 బ్రిటిష్ పరిపాలన, స్వాతంత్ర సమరం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అల్లూరి, కొమరం యువకులుగా ఉన్న సమయంలో ఇంట్లోనుంచి వెళ్లిపోయారు. రెండు మూడేళ్ళ పాటు వారిద్దరూ ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు అనే విషయం ఎవరికీ తెలియదు. ఆ సమయంలో వాళ్లిద్దరూ ఏం చేసి ఉంటారు అనే ఊహాజనితమైన కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    భారీ బడ్జెట్

    భారీ బడ్జెట్

    ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. అలియా భట్ రాంచరణ్ కు హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ బ్యూటీ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తోంది. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కీలక పాత్రలోనటిస్తున్నారు. ఇక తమిళ నటుడు సముద్రఖని సినిమా మొత్తం కొనసాగే పాత్రలో నటిస్తారట. 2020 జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

    English summary
    Ram Charan responds on his leg injury. Rajamouli directing this movie and DVV Danayya is the producer. Alia Bhatt and Daisy Edgar Jones are heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X