ట్రైలర్లో కాజల్ మిస్సింగ్.. ఏమయిందంటూ చరణ్ ను అడిగితే ఆసక్తికర సమాధానం!
మెగాస్టార్ హీరోగా నటించిన ఆచార్య సినిమా అనేక వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. శనివారం నాడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిగింది. కానీ ఎక్కడా కూడా కాజల్ అగర్వాల్ పేరు వినిపించలేదు. ఈ సినిమా నుంచి కాజల్ అగర్వాల్ ను తపిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఈ విషయం మీద పంపించారు. ఆ వివరాల్లోకి వెళితే

కాజల్ అగర్వాల్ ఏమైంది?
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ మొట్ట మొదటిసారి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. అపజయం ఎరగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 29వ తేదీ విడుదలకు సిద్ధమైంది. రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుందని ముందు నుంచే ప్రచారం జరిగింది.

ప్రస్తావించలేదు
అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పుడు కాజల్ అగర్వాల్ ఎక్కడా కనిపించలేదు. ఆ సమయం లోనే కాజల్ అగర్వాల్ కి సంబంధించిన సీన్లు చాలా వరకు కట్ అయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ అయితే లభించలేదు. కానీ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మొదలు ఈ సినిమా కోసం పనిచేసిన ఎవ్వరు కూడా అసలు కాజల్ అగర్వాల్ సినిమాలో ఉందనే విషయాన్ని ప్రస్తావించలేదు.

ఆసక్తికర విషయాలు
కేవలం కాజల్ అగర్వాల్ అనే కాదు సినిమాలో విలన్ గా నటించిన సోనూ సూద్ పేరు కూడా ఎవరూ ప్రస్తావించలేదు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తరువాత ఆదివారం నాడు రామ్ చరణ్ తేజ మీడియా మిత్రులతో సమావేశమయ్యారు. పూర్తిగా ఆఫ్ లైన్ భేటీ కావడంతో మీడియా ప్రతినిధులు పలు ఆసక్తికర విషయాలు అడిగి తెలుసుకున్నారు.

ఆసక్తికరంగా
అందులో భాగంగానే కాజల్ అగర్వాల్ ట్రైలర్ లో ఎందుకు కనిపించలేదు అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆమె ఎందుకు ట్రైలర్ లో కనిపించలేదు ఆమె పాత్రను సర్ప్రైజ్ గా ఉంచాలని అనుకుంటున్నారా అని రామ్ చరణ్ ను ప్రశ్నించారు. అయితే రామ్ చరణ్ ఈ ప్రశ్నకు ఆసక్తికరంగా స్పందించారు.

తెలియదు అంటూ
కాజల్ అగర్వాల్ నాన్నగారితో చిన్న చిన్న పోర్షన్స్ చేశారని అయితే వారి షూటింగ్ జరుగుతున్న సమయంలో నేను RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. తాను అలాగే ఫైనల్ ఎడిట్ కూడా చూడలేదు కాబట్టి ఆమె పాత్ర గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. అయితే సినిమా ప్రమోషన్స్ చేసే సమయంలో సినిమాకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకున్నాకే నటీనటులు ప్రమోషన్స్ మొదలు పెడతారు. మరి కాజల్ గురించి నాకు తెలియదు అంటూ రామ్ చరణ్ సమాధానం చెప్పడం కూడా ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.


Click it and Unblock the Notifications











