బాబాయ్ స్పీచ్‌కు ఫిదా అయిన రాంచరణ్.. ది మ్యాన్, ది లీడర్ అంటూ..!
Recommended Video

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరోమారు తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌పై ఉన్న ప్రేమని బయట పెట్టాడు.ఇటీవల పలు సంధర్భాల్లో రాంచరణ్.. పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నాడు. అటు పవన్ కూడా అబ్బాయ్ పై తన మమకారాన్ని చాటుకుంటున్నాడు. ఆ మధ్యన రంగస్థలం చిత్రం విడుదలైన సందర్భంగా పవన్ ఆ చిత్రాన్ని చూడడమే కాదు.. విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. తాజాగా చరణ్ తన పేస్ బుక్ పేజీలో పవన్ కళ్యాణ్ గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

డల్లాస్‌లో అదరగొట్టిన పవన్
అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ప్రవాస ఆంధ్రుల మద్దత్తు కూడగట్టేందుకు అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. డల్లాస్ లో నిర్వహించిన ప్రవాస గర్జన సభలో పవన్ తన ఎనర్జిటిక్ స్పీచ్ తో అదరగొట్టాడు. ఎన్నారైలని ప్రభావితం చేసేలా సాగిన పవన్ ప్రసంగం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ది మాన్, ది లీడర్ అంటూ
పవన్ కళ్యాణ్ డల్లాస్ ప్రసంగంపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన సోషల్ మీడియాలో స్పందించాడు. భయాన్ని ఎలా అధికమించాలో పవన్ చేసిన వ్యాఖ్యలని రాంచరణ్ ప్రస్తావించాడు. నేను విన్న గొప్ప మోటివేషనల్ స్పీచ్ లలో ఇది ఒకటి. ది మాన్, ది లీడర్, ది విజనరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ రాంచరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పవన్ ప్రసంగం మెగా పవర్ స్టార్ ని బాగా ప్రభావితం చేసినట్లు ఉంది.
సినీరాజకీయ అంశాలు
పవన్ కళ్యాణ్ ఈ ప్రసంగంలో తన సినీ, రాజకీయ అంశల గురించి పూర్తి స్థాయిలో మాట్లాడారు. సినిమారంగంలో సరైన విజయం లేక ఎదుర్కొన్న ఇబ్బందులని పవన్ ప్రస్తావించారు. తాను రాజకీయాల్లోకి వచ్చేలా చేసిన పరిస్థితులని వివరించారు. తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుభందం గురించి వివరించారు. పవన్ మాట్లాడుతున్నంత సేపు సభాప్రాంగణం మొత్తం ప్రవాస ఆంధ్రుల హర్షద్వానాలతో మారుమోగింది.

వినయ విధేయ రాముడిగా
ఇదిలా ఉండగా రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందితోంది. రాంచరణ్ కు జోడిగా కైరా అద్వానీ నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో, స్నేహ, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











