బాలీవుడ్ ఎంట్రీ గురించి రామ్ చరణ్
రామ్ చరణ్ త్వరలో బాలీవుడ్ లో ప్రవేశించనున్నారంటూ చాలా కాలంగా వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆయన ఓ ఇంగ్లీష్ డైలీ వద్ద మాట్లాడుతూ...ఈ సంవత్సరం చివరకు నా బాలీవుడ్ ఎంట్రీపై కొంత క్లారిటీ రావచ్చు. గత కొంత కాలంగా ఈ విషయమై టాక్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయానికి సంభంధించి అన్నీ ఫైనలైజ్ చేసి ఎనౌన్స్ మెంట్ ఇస్తాము అన్నారు. అయితే చిత్రం ప్రారంభమయ్యేది మాత్రం వచ్చే సంవత్సరమే అన్నారు. ఇక రచ్చ చిత్రం స్టేటస్ గురించి చెపుతూ..ఈ చిత్రాన్ని మేము తమిళ,మళయాళంలో ఒకే సారి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే కర్ణాటక మార్కెట్ ని సైతం ఎక్సప్లోర్ చేస్తాము అన్నారు.
ఇక ఆ మధ్య బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నటించిన సూపర్ హిట్ సినిమా 'జంజీర్'ని రామ్ చరణ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. జంజీర్ బాలీవుడ్ రీమేక్ లో చరణ్ త్వరలో బాలీవుడ్ తెరపై మెరవ బోతున్నాడంటూ హిందీ పత్రికలు సైతం రాసుకొచ్చాయి. అంతేకాక బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ మెహతా ఈ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడదే ప్రాజెక్టా లేక మగధీరను హిందీలో రీమేక్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే కొందరు మగధీరని హిందీలో రీమేక్ చేస్తూ ఎంట్రీ ఇస్తాడని అంచనాలు వేస్తున్నారు. ఏది నిజమో తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











