ఫేవరెట్ హీరో, హీరోయిన్ పేర్లు లీక్ చేసిన రామ్ చరణ్.. తెలుగు స్టార్లను కాదని అతడికే జై

తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే గ్లోబల్ రేంజ్‌కు ఎదిగారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. చిరంజీవి కుమారుడిగా వచ్చినా తనదైన చిత్రాలతో సత్తా చాటుతోన్న అతడు.. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రామ్ చరణ్.. తన ఫేవరెట్ హీరో, హీరోయిన్ల పేర్లను లీక్ చేశాడు. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!

గేమ్ చేంజర్‌గా రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్నాడు. దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఈ ఏడాది చివర్లోనే విడుదల చేసే అవకాశం ఉందని చెప్పాలి.

Ram Charan Reveals about His Favorite Hero and Heroine In India

బుచ్చిబాబుతో భారీ ప్రాజెక్ట్
రామ్ చరణ్ తన 16వ సినిమాను 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సనతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలోనే ఈ మూవీ షూట్ ప్రారంభం కానుంది.

సుకుమార్‌... వాళ్లతో కూడా
పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత రెట్టించిన జోష్‌తో కనిపిస్తోన్న రామ్ చరణ్.. ఇప్పుడు లైన్‌లో పెట్టిన చిత్రాల తర్వాత మరిన్ని ప్రాజెక్టులను చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే సుకుమార్‌తో మరో సినిమాను అనౌన్స్ చేసేశాడు. దీని తర్వాత అతడు లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్లతో మూవీలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Ram Charan Reveals about His Favorite Hero and Heroine In India

ఫేవరెట్ ఏంటో చెప్పాడు
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ అస్సలు తీరిక లేకుండా గడుపుతోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం తన పర్సనల్ ట్రిప్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ బడా హీరో ఓ ఇంటర్వ్యూ సెషన్‌లో పాల్గొన్నాడు. ఇందులో అతడు తనకు బుక్స్ అంటే ఇష్టం అని చెప్పాడు. అంతేకాదు, డెనిమ్ డ్రెస్‌లు కంఫర్ట్‌గా ఉంటాయని కూడా రామ్ చరణ్ వెల్లడించాడు.

ఫేవరెట్ హీరో అతడేనని
తాజా ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పర్సనల్ ఇష్టాల గురించి యాంకర్ ప్రశ్నలు వేసింది. ఈ క్రమంలోనే 'మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు' అని అతడిని ప్రశ్నించింది. దీంతో మెగా పవర్ స్టార్ కాసేపు ఆలోచించుకుని 'నాకు సూర్య అంటే ఇష్టం. అదేనండీ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తన యాక్టింగ్ నాకు బాగా నచ్చుతుంది' అంటూ తొలిసారి తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేశాడు.

Ram Charan Reveals about His Favorite Hero and Heroine In India

అందరూ కానీ ఆమె బాగా
ఇదే ఇంటర్వ్యూలో యాంకర్ 'మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు' అని రామ్ చరణ్‌ను ప్రశ్నించింది. దీనికతడు 'నాకు ఫేవరెట్ హీరోయిన్ అంటూ ఎవరూ లేరండి. అందరూ నాకు బాగానే నచ్చుతారు. కానీ, నా జనరేషన్ విషయానికి వస్తే మాత్రం సమంత అంటే నాకు ఇష్టం' అని చెప్పాడు. ఇలా తొలిసారి రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో, హీరోయిన్ పేర్లను లీక్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X