twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధృవ నుంచి ఆలోచన మారింది.. లంచ్ మీటింగ్‌లో రంగస్థలం, బాలయ్య సూపర్.. రాంచరణ్!

    |

    Recommended Video

    VVR Movie : Ram Charan Talks About His Effort

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం ఈ సంక్రాంతికి ముస్తాబవుతోంది. చరణ్ ఈ చిత్రం కోసం ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యాడు. బోయపాటి, చరణ్ తొలి కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పటిలాగే బోయపాటి తనదైన శైలిలో మాస్ అంశాలు మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్ చూపిన యాక్షన్ సీన్స్, రాంచరణ్ డైలాగ్స్ అభిమానులని ఆకర్షించే విధంగా ఉన్నాయి. రాంచరణ్ ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

    డిజైన్ చేస్తే హిట్స్ రావు

    డిజైన్ చేస్తే హిట్స్ రావు

    యాంకర్ రంగస్థలం విజయం గురించి ప్రస్తావించగా రాంచరణ్ స్పందించాడు. డిజైన్ చేసి సినిమాలు చేసినంత మాత్రాన హిట్స్ కావు. అందుకు ఉదాహరణ రంగస్థలం చిత్రం. మేము కూడా రంగస్థలం చిత్రాన్ని భారీ బడ్జెట్ లో తెరకెక్కించాలి, సినిమా భారీ స్థాయిలో ఉండాలి అని అనుకోలేదు. ధృవ నుంచి నా ఆలోచనలు మార్చుకున్నా. మంచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా అని చరణ్ తెలిపాడు.

    మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి.. మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

    లంచ్ మీటింగ్

    లంచ్ మీటింగ్

    నేను ధృవ చిత్రాన్ని ఫినిష్ చేసిన సమయంలోనే సుకుమార్ కూడా నాన్నకు ప్రేమతో చిత్రాన్ని ఫినిష్ చేశారు. ఒక లంచ్ మీటింగ్ లో మనమిద్దరం సినిమా ఎప్పుడు చేద్దాం అనే డిస్కషన్ వచ్చింది. అనుకున్నదే ఆలస్యం.. వెంటనే సుకుమార్ తాను సిద్ధం చేసి ఉంచిన కథని ఇంటి నుంచి తీసుకుని వచ్చారు. విన్నాను.. ఒకే చేశాను.. అంత సింపుల్ గా జరిగిపోయింది.

    భయం వేసింది

    భయం వేసింది

    రంగస్థలం చిత్రం ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. పైగా భయం వేసింది. ఎక్కువగా ప్రయోగం చేస్తున్నామా.. వినికిడి లోపంతో నటించడం రిస్క్ కదా అని అనిపించింది. రంగస్థలం ఎక్కడో మారుమూలన జరిగేకథ. కృష్ణ వంశి పెల్లెటూరి సినిమాల లాగా కలర్ ఫుల్ గా ఉండదు. అవుట్ పుట్ కరెక్ట్ గా వస్తే చాలు అని భావించినట్లు రాంచరణ్ తెలిపారు.

    టిపికల్ బోయపాటి సినిమా

    టిపికల్ బోయపాటి సినిమా

    ఇక వినయ విధేయ రామ గురించి మాట్లాడుతూ.. ఇది టిపికల్ బోయపాటి సినిమా అని రాంచరణ్ తెలిపాడు. తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతో ఈ చిత్రంలో కుటుంబం కోసం పోరాడే యువకుడిగా కనిపిస్తా. ఈ పాత్రలో నేను లోపల ఒకలా.. బయట ఒకలా ఉంటా .. అదేంటో థియేటర్స్ లో చూస్తారు అని చరణ్ తెలిపాడు.

    బాలయ్య సూపర్

    బాలయ్య సూపర్

    ఈ చిత్రంలో బోయపాటి రాసిన భారీ డైలాగ్స్ నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇంతకు ముందు బోయపాటి సినిమాల్లో బాలయ్య అద్భుతంగా డైలాగులు చెప్పారు అని రాంచరణ్ తెలిపాడు. బోయపాటి మీద నమ్మకం నుంచి ఈ చిత్రాన్ని ఫినిష్ చేసానని చరణ్ తెలిపారు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలని అజర్బైజాన్ లో చిత్రీకరించాం. అజార్బైజాన్ ని ఈ చిత్రంలో నేపాల్, బీహార్ బోర్డర్ గా చూపించినట్లు రాంచరణ్ తెలిపాడు.

    కియారా కళ్ళు

    కియారా కళ్ళు

    అజార్బైజాన్ లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలో షర్ట్ లేకుండా నటించాల్సి వచ్చింది. స్క్రీన్ పై అవుట్ ఫుట్ చూసి తాను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది అని అనిపించినట్లు రాంచరణ్ తెలిపాడు. హీరోయిన్ కియారా అద్వానీ గురించి మాట్లాడుతూ చాలా అద్భుతమైన నటి. కళ్ళతోనే భావాలు పలికించగల ప్రతిభ ఆమె సొంతం అని ప్రశంసించాడు.

    English summary
    Ram Charan reveals how changed he is after Dhruva. Interesting details about Vinaya Vidheya Rama
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X