For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR, ఆచార్య సీక్రెట్స్ లీక్ చేసిన రాంచరణ్.. సాయిధరమ్ తేజ్ హెల్త్ గురించి బిగ్‌బాస్‌లో నాగ్‌‌కు ఏం చెప్పారంటే!

  |

  బిగ్‌బాస్ తెలుగు 5 షో సెప్టెంబర్ 18వ తేదీ ఎపిసోడ్ హై ఎనర్జీతో సాగింది. ఇంటి ముగింట్లోకి మెగా పవర్‌స్టార్ రాంచరణ్, మ్యాస్ట్రో చిత్రంలో నటించిన నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్ వేదికపై రావడంతో ప్రేక్షకులకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా మారింది. అంతేకాకుండా ఇంటిలోని సమస్యలను, కొన్ని ఇష్యూలను హోస్ట్ నాగార్జున అడ్రస్ చేశారు. ఇలా రకరకాల అంశాలతో బిగ్‌బాస్ వారాంతపు శనివారం ఎపిసోడ్ కలర్‌ఫుల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  డిస్నీ+స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా

  డిస్నీ+స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా

  బిగ్‌బాస్ వేదికగా డిస్నీ+హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ ఎంపిక గురించి అధికారికంగా ప్రకటించారు. డిస్నీ+హాట్ స్టార్ కోసం రూపొందించిన యాడ్‌లో రాంచరణ్ హావభావాలు, మ్యాజిక్ అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. మెజీషియన్‌గా రాంచరణ్ బాడీ లాంగ్వేజ్ బ్రహ్మండంగా అలరించింది. తన యాడ్ చూసిన తర్వాత రాంచరణ్ స్పందిస్తూ.. ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. నాన్న చిరంజీవి గారు కూడా చూడలేదు. ఈ యాడ్ చూసింది కేవలం మీరే. తొలి వ్యక్తి కూడా మీరే అంటూ రాంచరణ్ చెప్పారు.

  రాంచరణ్ షో మ్యాన్‌గా అంటూ

  రాంచరణ్ షో మ్యాన్‌గా అంటూ

  డిస్నీ+ హాట్ స్టార్ కోసం రూపొందించిన యాడ్‌లో షో మ్యాన్‌ లాగా ఉన్నావు. యాడ్ భలే ఉంది. సూట్‌లో చూశాను. మగధీరలో 100 మందిని నరకడం చూశాను. రంగస్థలం సినిమాలో పల్లెటూరి అబ్బాయిగా చూశాను. నీ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా నచ్చింది. ఇది ఎలా సాధ్యపడింది. టోటల్‌గా యాడ్‌లో మ్యాజిక్ చేశావు అంటూ రాంచరణ్‌పై నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారు.

  నాగార్జున మీరు ఇంత అందంగానా?

  నాగార్జున మీరు ఇంత అందంగానా?

  నాగార్జున ప్రశంసలు కురిపిస్తుంటే.. మీకు గురించి ఒక విషయం అడగాలని అనుకొంటున్నాను. మీరు ఇంత అందంగా, ఫిట్‌గా ఎలా ఉంటారు. అఫ్ కోర్స్ మా నాన్నకు, మీకు ఒకరే ట్రైనర్. మిమ్మల్ని చూస్తుంటే స్పూర్తిగా ఉంటుంది అని రాంచరణ్ అంటే.. అవును అర్జున్ మాకు ట్రైనర్.. ఇద్దరికి ట్రైనింగ్ ఇస్తుంటారు. ప్రతీ రోజు చిరంజీవి గారు వర్కవుట్స్ చేస్తుంటారా అని తెలుసుకొంటాను అని నాగార్జున అన్నారు.

  నాగార్జునను అన్నయ్య అంటూ రాంచరణ్

  నాగార్జునను అన్నయ్య అంటూ రాంచరణ్

  మీ జనరేషన్ హీరోలు ఏ మాత్రం తక్కువగా లేరు. మీరు, తారక్, మహేష్, ప్రభాస్ మీరంతా ఎలా కష్టపడుతున్నారో నాకు తెలుసు. మీ ఎనర్జీ లెవల్స్ నెక్ట్స్ లెవల్. RRR కోసం యాక్షన్ సీన్లలో మీరు ఎంత కష్టపడుతున్నారో అన్నీ వింటున్నాం. అవుట్ స్టాండింగ్ అంటూ నాగార్జున అన్నారు. అయితే నాగార్జున చూస్తూ మిమ్మల్ని అంకుల్ అనాల్నా.. లేక సార్ అనాలా తెలియడం లేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే అన్నయ్య అని పిలువాలని ఉంది అని రాంచరణ్ అంటే.. తమ్ముడు అంటూ నాగ్ అతడిని కౌగిలించుకొన్నాడు.

  RRR పాటను చూపించమని రాజమౌళిని అడిగితే..

  RRR పాటను చూపించమని రాజమౌళిని అడిగితే..

  ఆ తర్వాత రాంచరణ్‌ను RRR సినిమా ఎలా వస్తుంది అని నాగార్జున అడిగితే.. నాకు కూడా ఆ సినిమా ఎలా వస్తుంది అనే ప్రశ్న వస్తున్నది. ప్రతీ రోజు డబ్బింగ్ చెబుతున్నాను. కార్తీకేయ, వల్లి గారిని ఎప్పుడూ అడుతుంటాను.. ఒక్కసారి నాకు పాట చూపించమని వేడుకొన్నాను. మాతో 15 రోజులు సినిమా షూటింగు చేసిన తర్వాత కూడా మాకు చూపించారా అంటే చూపించడం లేదు అని రాంచరణ్ అన్నారు. దాంతో కనీసం నాకైనా చూపించండి అంటూ రాజమౌళిని నాగార్జున వేడుకొన్నారు.

  డాడీతో ఆచార్య మూవీలో నటిస్తే.

  డాడీతో ఆచార్య మూవీలో నటిస్తే.

  ఆచార్య సినిమా ఎలా వస్తున్నది అని రాంచరణ్‌ను నాగార్జున అడిగితే.. లాస్ వీక్ ఆచార్య షూటింగులో పాల్గొన్నాను. డాడీతో వర్క్ చేయడం కొత్త అనుభూతి. ఇంట్లో ఉంటే.. కనీసం అంత క్లోజ్‌గా ఉండం. షూటింగులో ఆయనతో పనిచేస్తుంటే ఆ విషయం నాకు బోధపడింది. ఇప్పుడు ఆ విషయం అర్ధం కాదు అని రాంచరణ్ అన్నాడు. దాంతో నాగార్జున స్పందిస్తూ.. మా నాన్నతో కలిసి పనిచేయలేదు. ఆయన ఎప్పుడూ కాళ్లను తాకనిచ్చేవారు కాదు. కానీ ఓ సినిమాలో కాళ్లకు దండం పెట్టుకొనే సీన్లో ఆయనను తాకగానే.. దీవెనలు ఇచ్చారు. అప్పడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి అని నాగార్జున చెప్పారు.

  సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి

  సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి

  ఇక సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి నాగార్జున అడిగితే.. సాయిధరమ్ తేజ్ మెల్లగా కోలుకొంటున్నారు. ఆయన అంతటా ఆయన ఆరోగ్యంతో రావాలి. అప్పటి వరకు మేము జాగ్రత్తలు తీసుకొంటూనే ఉంటాం. ఎలాంటి క్రిటికల్ ఇష్యూల్ లేవు. సాయిధరమ్ తేజ్ చాలా హ్యపీగా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు అంటూ రాంచరణ్ చెప్పడంతో నాగార్జున చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

  English summary
  Mega Power Star Ram Charan shines on the bigg boss Telugu 5 stage with Nagarjuna. Charan reveals secrets about Sai Dharam Tej Health, RRR, Acharya movie. He called Nagarjuna as brother.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X