Ram Charan మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీపై రాంచరణ్ రివ్యూ.. మెగా పవర్ స్టార్ ఏమన్నారంటే?
దక్షిణాది సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి, జాతిరత్నాలు సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకొన్న యువ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. సినీ ప్రేక్షకులతోపాటు హీరోలు, సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాపై తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సినిమాపై రాంచరణ్ చేసిన పోస్టు వివరాల్లోకి వెళితే..
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ఓ భావోద్వేగమైన ప్రేమ కథ. తన కంటే వయసులో పెద్ద అయిన మహిళతో యువకుడు ప్రేమలో పడటం, ఆ ప్రేమను ఆ మహిళ తిరస్కరించడం ఓ ట్విస్టుగా కథ కొనసాగుతుంది. అయితే తన ప్రేమను అంగీకరించకపోవడం వెనుక కారణం తెలుసుకొన్న యువకుడు.. ఆమె ప్రేమను పొందడానికి ప్రయత్నించడం ఈ సినిమా కథగా చెప్పుకొవచ్చు.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను రిలీజ్‌కు ముందే మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీని చూసి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాకు నేను మొదటి ప్రేక్షకుడిని. తన మనసుకు బాగా నచ్చిన చిత్రం. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి ఇద్దరు పోటాపోటీగా నటించారు. ఈ సినిమా యూనిట్ అందరికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి విషెస్ తెలియజేశారు.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోయింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్సీస్‌లో 1.5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకొన్నది.
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం తెలుగు, తమిళ రాష్ట్రాలతోపాటు కన్నడలో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. తొలి వారం ఈ సినిమా ఇండియాలో 17.7 కోట్లు వసూలు చేయగా.. తెలుగులో 17.5 కోట్లు, తమిళంలో 25 కోట్లు వసూలు చేసింది. గత 10 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 32 కోట్ల వసూళ్లు రాబట్టింది.

మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం భారీ విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో రాంచరణ్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను చూశాను. కామెడీ టైమింగ్‌తో దాడి చేసినంత పనిచేశారు. నవీన్ శెట్టి కామిక్ టైమింగ్, అనుష్క శెట్టి అందం, అభినయం చక్కగా కుదిరింది. దర్శకుడు మహేష్ బాబుకు, యూవీ క్రియేషన్స్‌కు అభినందనలు తెలిపారు.


Click it and Unblock the Notifications











