కళ్యాణ్ బాబాయ్ తో చేయాలనే ... : రామ్ చరణ్
''అంత మాత్రాన నాకూ నాన్నకీ మధ్య ఏదో జరుగుతున్నట్టు కాదు కదా? కుటుంబ సభ్యులంతా తరచూ కలుసుకొంటుంటాం. కబుర్లు చెప్పుకొంటుంటాం, భోజనం చేస్తుంటాం. అలా కూడా కలవడం లేదంటే అప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు. కల్యాణ్ బాబాయ్‌తో కలిసి ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. మంచి కథ దొరికితే తప్పకుండా ఇద్దరం కలిసి నటిస్తాం'' అని పవన్ తో విభేధాలంటూ వస్తున్న వార్తలను ఖండించారు.
ఇక వైవాహిక జీవితం ఇటీవలే యేడాది పూర్తి చేసుకొంది. జీవితం చాలా బాగుంది. అయితే... నేను, ఉపాసన కలిసి హైదరాబాద్‌లో సరదాగా ఓ పది రోజులు ఎప్పుడూ గడిపింది లేదు. 'జంజీర్' సినిమా హడావుడితో ముంబయి, హైదరాబాద్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు మాత్రం కాస్త తీరిక దొరికింది. అందుకే ఓ నెల రోజులు సెలవు తీసుకొన్నా. ఇద్దరం కలిసి పది రోజులు ఎక్కడికైనా బయటికి వెళ్లాలనుకొంటున్నాం అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్.
అలాగే పెళ్లి రోజున ఉపాసన ఓ కుక్కపిల్లని బహుమతిగా ఇచ్చారనీ, దానికి ఆ మధ్య గాయం అయ్యిందని చెప్పారు. ఆ కుక్క పేరు... బ్రాట్. దీనికి ఆ మధ్య పెద్ద గాయం అయ్యింది. శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బ్రాట్‌కి గాయం కావడం నన్ను చాలా బాధకి గురిచేసింది. దీంతో మూడు నెలలు మాంసాహారం తినడం మానేశాను. నేను ఎప్పుడూ అంతగా బాధపడింది లేదు. ఇప్పుడు బ్రాట్ ఇంట్లో తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications












