»   » రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ కంపెనీ పేరు మారిందా?

రామ్ చరణ్ ఎయిర్ లైన్స్ కంపెనీ పేరు మారిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూలై నెలలో ‘టర్బోమేఘ' ఏవియేషన్ కంపెనీని స్థాపించారు. కంపెనీ డైరెక్టర్లలో రామ్ చరణ్ ఒకరు. వంకయలపాటి ఉమేష్ మేనేజింగ్ డైరెక్టర్. కేంద్ర రీజనల్ ఎయిర్ లైన్స్ నుండి ఈ కంపెనీకి అనుమతి లభించింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ ఎయిర్ లైన్స్ పేరును ‘ట్రుజెట్' గా మార్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నెల నుండి విమాన సర్వీసులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి ఆధ్యాత్మిక ప్రదేశాలకు విమాన సేవలను అందించనున్నారు. అందరికి అందుబాటులో ఎకానమి ప్రైస్ తో స్వర్వీసులు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికుల కోసం 9 సీట్లు కల జెట్ ఎయిర్ వేస్ నడుపుతారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ram Charan’s airline named Trujet
English summary
Some time back, we had reported that Ram Charan’s co-owned chartered flight operator ‘Turbo Megha’ got a clearance from the Indian government to fly regionally. According to the latest reports, the airline has been named Trujet and will start its services from the month of April.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu