రామ్ చరణ్ చుట్టూ లవ్లీ లేడీస్... పార్టీలో ఎన్టీఆర్ భార్య కూడా (ఫోటోస్)
రామ్ చరణ్ భార్య ఉాపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకు సంబంధించిన, రామ్ చరణ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా క్రిస్మస్ పార్టీ ఫోటోస్ ఉపాసన అభిమానులతో పంచుకున్నారు.
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్, ఉపాసన క్రిస్మస్ పార్టీ హోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో ఉపాసన, రామ్ చరణ్ ఫ్రెండ్స్ సందడి చేశారు. ఇందులో ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా ఉండటం విశేషం.
లవ్లీ లేడీస్‌తో రామ్ చరణ్
తన ట్విట్టర్ పేజీ ద్వారా ఉపాసన ఓ ఫోటో షేర్ చేశారు. ఇందులో రామ్ చరణ్ మధ్యలో కూర్చుని ఉండగా... చుట్టూ లేడీస్ ఉన్నారు. దీనికి ‘లవ్లీ లేడీస్‌తో కలిసి రామ్ చరణ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్' అనే క్యాప్షన్ పెట్టారు.
ఎన్టీఆర్ భార్య కూడా
ఈ పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా పాల్గొనడం చర్చనీయాంశం అయింది. రామ్ చరణ్‌తో పాటు ‘వినయ విధేయ రామ' చిత్రంలో నటించిన హీరోయిన్ కియారా అద్వానీ కూడా ఈ పార్టీలో భాగం కావడం గమనార్హం.

వినయ విధేయ రామ
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ' సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్ సెన్సార్ పార్మాలిటీస్ పూర్తి చేసుకునే పనిలో ఉంది.

ఆర్ఆర్ఆర్
కాగా... రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత మొదలు కానుంది.


Click it and Unblock the Notifications











