800 మంది డాన్సర్స్.. షాకిచ్చేలా రాంచరణ్ సినిమా.. ఖర్చు ఊహకందని విధంగా!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బోయపాటి శ్రీను తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాల్ని కళ్ళు చెదిరే విధంగా రూపొందించారట. ఈ చిత్ర షూటింగ్ ఒకటి, రెండు రోజుల్లో ముగియనుంది. తాజాగా చిత్రీకరిస్తున్న ఓ పాట గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

800మంది డాన్సర్స్
దర్శకుడు బోయపాటి శ్రీను భారీ ఖర్చుతో రాంచరణ్, కైరా అద్వానీపై అదిరిపోయే మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. ఈ పాటతో వినయ విధేయ రామ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ పాటలో 800 మంది డాన్సర్లు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ అదిరిపోయేలా ట్యూన్ చేసిన ఈ మాస్ బీట్ ని బోయపాటి అంతే అద్భుతంగా చిత్రీకరిస్తునట్లు వార్తలు వస్తున్నాయి.

కాస్ట్లీ సాంగ్
టాలీవుడ్ లోనే దీనిని అత్యంత భారీ ఖర్చుతో కూడుకున్న పాటలలో ఒకటిగా చిత్ర యూనిట్ అభివర్ణిస్తోంది. అభిమానులకు ఈ పాటలో రాంచరణ్ డాన్సులు, మైమరపించే విజువల్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు. రాంచరణ్ చివరి చిత్రం రంగస్థలంకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ఆల్బమ్ అందించాడు. దీనితో వినయ విధేయ రామ ఆడియోపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రాంచరణ్ మాస్ లుక్ లో కనిపిస్తాడని.. అలాగే హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో ఉండబోతున్నట్లు సమాచారం.

ప్రీరిలీజ్ ఈవెంట్
ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే థియేట్రికల్ ట్రయిలర్ లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరొస్తారనేది తెలియాల్సి ఉంది. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 11 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

పవర్‌ఫుల్ విలన్
ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. సీనియర్ నటి స్నేహ చాలా రోజుల తర్వాత ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. తమిళ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత చరణ్ ఇప్పటికే ప్రారంభమైన ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీ అవుతాడు. రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కూడా డివివి దానయ్యే నిర్మాత.


Click it and Unblock the Notifications











