»   » పోలీస్ ఆఫీసర్ల కోసమే ఒక షో... రామ్ చరణ్ నిర్ణయం బావున్నట్టే ఉంది

పోలీస్ ఆఫీసర్ల కోసమే ఒక షో... రామ్ చరణ్ నిర్ణయం బావున్నట్టే ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

'చరణ్' కొత్త సినిమా ధృవ కోసం 'మెగా ఫ్యాన్స్' ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళ సూపర్ హిట్ తనీ ఒరువన్ కి రేమేక్ గా వస్తున్న ఈ సినిమా కోసం . ఇదివరకు ఎన్నడూ లేనంత శ్రద్ద తీసుకున్నాడు రామ్ చ్రణ్, ఇప్పటిదాకా హెయిర్ స్టయి మార్చటం కొంత డ్రెస్సింగ్ స్టైల్ మీద తప్ప ఎక్కువ దృష్టి పెట్టని చరణ్ ఈ సారి మాత్రం చాలానే చేసాడు.

ఇందుకు రెండు కారణాలున్నాయి. 'చెర్రీ' గత చిత్రాలు నిరాశపరచడం తో ఈ సినిమాని ఒక చాలెంజ్ గా తీసుకున్నాడు ఈ మెగా వరసుడు. ఒక రకంగా వరుస ఫెయిల్యూర్లతో బాగా నిరాశలో ఉన్న మెగా అభిమానులకు కూడా జోష్ ఇచ్చే సినిమా గా 'ధృవ" నిలవనుంది. దీంతో సహజంగానే 'చరణ్' కొత్త సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 'సురేందర్ రెడ్డి' దర్శకత్వం వహిస్తోన్న "ధృవ" ప్రారంభోత్సవం రోజే దసరాకు రిలీజ్ చేస్తామని చెప్పారు. . అయితే సినిమాని మొదట దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్నా హడావుడిగా పనులు పూర్తి చేయడం ఇష్టం లేక టీమ్ నిదానంగా అన్నింటినీ సంతృప్తికరంగా ఫినిష్ చేసి డిసెంబర్ కు విడుదల చేయాలని నిర్ణయించింది. . ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం రామ్ తీసుకున్న నిర్ణయం కూఅడా ఆనందం గానే ఉంది... ఇంతకీ రాం ఏం చేయబోతున్నాడో తెలుసా..??

మరోసారి పోలీస్ గా

మరోసారి పోలీస్ గా

తమిళ చిత్రం 'తని ఒరువన్‌'కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రం 'ధ్రువ'. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ పోలీసుగా కనిపించబోతున్నారు. రామ్ చరణ్ అంతకు ముందు తుఫాన్ చిత్రంలో పోలీస్ గా కనిపించాడు. అయితే అనుకోని విదంగా ఆ సినిమా బోల్తా పడింది. ఇప్పుడు మరోసారి పోలీస్ గా కనిపించి అలరించనున్నాడు.

లుక్ మార్చుకున్నాడు

లుక్ మార్చుకున్నాడు

హెయిర్ స్టైల్ లో కాస్త మార్పు తప్పిస్తే చరణ్ దాని మీద ఆసక్తి పెట్టడు . కానీ కొత్త సినిమా ధ్రువ విషయం లో మాత్రం మనోడు చాలానే కష్టపడ్డాడు అని చెప్పాలి. ఐ పీ ఎస్ ఆఫీసర్ గా మంచి లుక్ రావాడం తో పాటు బాడీ ల్యాంగ్వేజ్ కూడా బాగుండాలి అనే ఆలోచన తో చెర్రీ ఎన్నో ఇబ్బందులు పడి , కష్టపడి లుక్ మార్చుకున్నాడు.

ఆలస్యం కూడా మంచిదే

ఆలస్యం కూడా మంచిదే

నిజానికి 'ధృవ' చిత్రం వచ్చే నెల అక్టోబర్ న రిలీజ్ కావాల్సింది. అయితే 'అరవింద్ స్వామి' అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమయ్యేలా కనిపిస్తోందని వినికిడి. దీంతో ఆయనకు సంబంధించిన షూటింగ్ కి మరింత టైం పట్టనుందట. దీంతో ఈ చిత్రానికి దసరా నుంచి తప్పించి డిసెంబర్ విడుదల చేయాలని 'చరణ్' భావిస్తున్నాడట. అంతే కాదు రెండు నెలల సమయం దొరకడంతో ప్రమోషన్స్ కి కూడా కావాల్సినంత టైం దొరినట్లైందని యూనిట్ భావిస్తోంది

శాఖాహారిగా మారి కఠినమైన డైట్‌

శాఖాహారిగా మారి కఠినమైన డైట్‌

ఈ చిత్ర షూటింగ్‌ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. సెట్‌లో రామ్‌ చరణ్‌తో దిగిన ఓ సెల్ఫీని నటుడు నవదీప్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'ఎప్పటికీ బెస్ట్‌ కో సూపర్‌ స్టార్‌. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది' అని నవదీప్‌ పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలో చెర్రీ, నవదీప్‌ పోలీస్‌ డ్రెస్‌లో ఫోజిచ్చారు. ఈ చిత్రం కోసం చరణ్‌ శాఖాహారిగా మారి కఠినమైన డైట్‌ పాటిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక విదేశీ ట్రైనర్ల సహకారంతో ఫిట్‌నెస్‌ కసరత్తులు కూడా చేశారు.

సరికొత్త లుక్‌తో పోలీసాఫీసర్‌గా

సరికొత్త లుక్‌తో పోలీసాఫీసర్‌గా

ఈ సినిమాలో నాజర్ .. పోసాని కృష్ణమురళి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.తమిళంలో 'తని ఒరువన్' వైవిధ్యభరితమైన చిత్రంగా ప్రశంసలు అందుకుంది. భారీ వసూళ్లను రాబడుతూ, విజయవిహారం చేసింది.ఓ సరికొత్త లుక్‌తో పోలీసాఫీసర్‌గా రామ్ చరణ్ కనిపించనుండడంతో ఈ సినిమాపై మొదట్నుంచే మంచి అంచనాలున్నాయి.

పోలీస్ ఆఫీసర్ లకి స్పెషల్ షో

పోలీస్ ఆఫీసర్ లకి స్పెషల్ షో

దసరాకి రిలీజ్ కావాల్సిన ధృవ డేట్ మారి క్వాలిటీ పేరుతో నెక్స్ట్ వారానికి వాయిదా పడింది. ఈ సినిమా ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారు అనే క్లారిటీ అయితే రాలేదు కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్ లకి స్పెషల్ షో వెయ్యబోతున్నారు అని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ కొందరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ లని ఎంచుకుని వారిని తమ కుటుంబాలతో పాటు ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో స్క్రీనింగ్ వేస్తారట.

ఐ.పీ.ఎస్. లతో అనుబందం

ఐ.పీ.ఎస్. లతో అనుబందం

ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందర చరణ్ చాలామంది పోలీస్ ఆఫీసర్ లని కలిసారు. ఐ పీ ఎస్ అధికారి యొక్క ప్రవర్తన , బాడీ ల్యాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది చూడడం కోసం వారిని కలిసిన రామ్ చరణ్ చాలా కాలం వాళ్ళ తో కలి ఉండటం తో వారితో మంచి అనుబంధం కూడా ఏర్పరచుకున్నాడు. వారి చొరవ కూడా తోడ్పాటుగా ఉండడం తో ఈ సినిమా పూర్తి చేసిన చరణ్ వారికి ఒక స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేద్దాం అని ఫిక్స్ అయ్యాడట.

డిసెంబర్ కు విడుదల

డిసెంబర్ కు విడుదల

అలాగే గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రానికి సరికొత్త రీతిలో ప్రమోషన్లు చేయనుంది. ఈ పనులు ఈ దసరా నుండి ప్రారంభమవుతాయి. అలాగే సినిమాని మొదట దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్నా హడావుడిగా పనులు పూర్తి చేయడం ఇష్టం లేక టీమ్ నిదానంగా అన్నింటినీ సంతృప్తికరంగా ఫినిష్ చేసి డిసెంబర్ కు విడుదల చేయాలని నిర్ణయించింది.

English summary
Ram Charan has taken suggestions from some police officers. Ramcharan has decided to exhibit a special Druva show to the police officers who gave him suggestions and also to the police officers in other regions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu