»   » నాగబాబు అనుకుంటే చిరు ‘గ్యాంగ్ లీడర్’ అయ్యాడు, చెర్రీ డబ్ స్మాష్!

నాగబాబు అనుకుంటే చిరు ‘గ్యాంగ్ లీడర్’ అయ్యాడు, చెర్రీ డబ్ స్మాష్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో భారీ విజయ సాధించిన చిత్రాల్లో 'గ్యాంగ్ లీడర్' ఒకటి. ఈచిత్రం విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రామ్ చరణ్ రఫ్పాడించేస్తా డైలాగ్ చెబుతూ డబ్ స్మాష్ వీడియో పోస్టు చేసారు.

'డాడీ కెరీర్లో గ్రేట్ మార్క్ మూవీ ఇది. మే 9తో ఈ చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నా చిన్నతనంలో వచ్చిన ఈ చిత్రం నాకు ఇంకా గుర్తుంది. అపుడు ఈ సినిమాలోని పాటలకు నేను ఉత్సాహంగా డాన్స్ చేసేవాడిని. జి ఎ ఎన్ జి గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటి.' అంటూ చెర్రీ తెలిపారు.

తెలుగు సినిమా మార్కెట్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. ఫ్యామిలీ కథకు రివెంజ్ ఫార్ములా జత చేసిదర్శకుడు విజయ బాపినీడు తీసిన ఈ చిత్రం క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. 1991 మే 9న రిలీజైన ఈ చిత్రం 55 థియేటర్స్‌లో 100 రోజులు ఆడింది.

వాస్తవానికి ఈచిత్రాన్ని నాగబాబుతో చేయాలనుకున్నారు. టైటిల్ కూడా 'గ్యాంగ్ లీడర్' కాదు 'అరె బో సాంబా' పేరుతో చేయాలనుకున్నారు. 'ఖైదీ నెం. 786' తర్వాత మరో సినిమా చేస్తానని విజయబాపినీడుకి చిరంజీవి మాట ఇచ్చారు. సమయం చూసి సినిమా చేద్దామని కబురు పెట్టారు. అప్పటికి విజయబాపినీడు దగ్గర కొత్తకథలు లేవు. మరో వైపు చిరంజీవి డేట్స్ ఇచ్చాడు. అప్పటికప్పుడు కథ సిద్దం చేసే సమయం లేదు. దీంతో నాగబాబు కోసం తయారు చేసిన కథనే చిరంజీవికి వినిపిస్తే బాగుంది చేద్దామన్నారట. అలా నాగబాబుతో చేయాల్సిన ఈ సినిమా చిరంజీవితో సెట్టయింది.

గ్యాంగ్‌లీడర్ సినిమాలో చిరంజీవి ఇన్‌వాల్వ్‌మెంటే సక్సెస్ కు కారణమని విజయబాపినీడు చెబుతుంటారు. సినిమా మొదలుపెట్టినప్పుడు నిర్మలమ్మ, చిరంజీవి మధ్య పెద్దగా సన్నివేశాలు లేవు. రాజా విక్రమార్క కోసం అనుకుని తీయకుండా వదిలేసిన ముసలి గెటప్ సీన్ చిరంజీవి సలహా మేరకే దర్శకుడు గ్యాంగ్‌లీడర్లో పెట్టాడు. సినిమాకు హైలైట్‌గా నిలిచిన చిరంజీవి, నిర్మలమ్మ ఎపిసోడ్‌లోని కొన్ని సన్నివేశాలకు చిరంజీవి మాటలు రాయడం విశేషం. అంతేకాదు 'రఫ్ ఆడిస్తా ' అన్న ఊతపదం కూడా చిరంజీవి ఇచ్చిన ఐడియా నుండే వచ్చిందట.

English summary
Ram Charan surprised the mega fans on the occasion of 25 years of Gang Leader. "Few movies left a great mark on Dad's career. It was 25 years ago on 9th may.. ‪#‎GangLeader‬ got released..which is one of a kind." "I remember as a child dancing to all those songs :) G A N G Gang Gang bajavo bang bang.. :) one of my all time favourites !! #‎25YearsForGangLeader‬", read a post from Charan, on 9 May, which marks the silver jubilee of the blockbuster film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu