ఇదో గొప్ప అనుభవం.. ఇప్పుడే అసలైన మెగాస్టార్‌ని చూశా.. రామ్ చరణ్ కామెంట్స్

Recommended Video

Ram Charan's Emotional Instagram Post About Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. చారిత్రాత్మక నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నిర్మాతగా తండ్రిపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు రామ్ చరణ్. వివరాల్లోకి పోతే..

భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వాల్యూస్

భారీ బడ్జెట్.. హై టెక్నికల్ వాల్యూస్

నిర్మాత రామ్ చరణ్ తేజ్ సైరా నరసింహా రెడ్డి ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. ఈ మేరకు భారీ బడ్జెట్ కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా రూపొందించాడు. ప్రస్తుతం జరుగుతున్న వీఎఫ్ఎక్స్ పనుల్లోనూ ఎక్కడా వెనక్కి తగ్గొద్దని సూచిస్తున్నారట రామ్ చరణ్. మరోవైపు చిరంజీవి కూడా కొన్ని సూచనలిస్తున్నారని తెలిసింది.

సంచలనాలకు చిరునామా 'సైరా' టీజర్

సంచలనాలకు చిరునామా 'సైరా' టీజర్

ఇక ఇటీవలే విడుదలైన సైరా నరసింహా రెడ్డి భారీ సంచలనాలకు తెరలేపింది. ఈ టీజర్ లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండటంతో అన్ని భాషా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

రామ్ చరణ్ ఫీలింగ్స్

రామ్ చరణ్ ఫీలింగ్స్

దీంతో చిరు తనయుడు రామ్ చరణ్‌ ఒక గొప్ప సినిమా తీశాడనే ఫీలింగ్ వచ్చింది ప్రేక్షకుల్లో. మరోవైపు రామ్ చరణ్ కూడా ఇలాగే ఫీలవుతున్నారు. ఇన్నాళ్లు చిరంజీవిలో తండ్రిని చూసుకున్న చరణ్.. ఇప్పుడు నిర్మాతగా తన హీరోని చూసుకుంటున్నాడు. తన సినిమాలో తండ్రిని హీరోగా చూసి తెగ మురిసిపోతున్నాడు రామ్ చరణ్.

తండ్రి గడ్డాన్ని పట్టుకుని మురిసిపోతూ..

''సైరా సినిమా కోసం నాన్న పరివర్తన చెందిన విధానం ఒక గొప్ప అనుభవం. నిర్మాతగా మారిన తర్వాతనే ఆయనలో అసలైన మెగాస్టార్‌ని చూశా'' అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు రామ్ చరణ్. దీంతో పాటు సైరా నరసింహా రెడ్డి రూపంలో ఉన్న తన తండ్రి గడ్డాన్ని రెండు చేతులతో పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు చెర్రీ. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X