లీక్ చేసిన కోన: రామ్ చరణ్ మరో సినిమా ఖరారైంది!

By Bojja Kumar

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్ల నుంది. కాగా రామ్ చరణ్ మరో చిత్రం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ తన ట్విట్టర్ ద్వారా లీక్ చేసిన విషయాలను బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది.

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ కథ సిద్దం చేస్తున్నారు. ఈ విషయాన్ని కోన వెంకట్ వెల్లడిస్తూ ‘నేను, గోపీ మోహన్ కలిసి రామ్ చరణ్ కోసం కథ రెడీ చేస్తున్నాం. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు ఓ క్రేజీ డైరెక్టర్ దర్శకత్వం వహించబోతున్నారు. అతను ఎవరనే విషయం త్వరలో వెల్లడిస్తాం. ఈ దర్శకుడికోసం నేను, గోపీ మోహన్ తొలిసారి కలిసి పని చేస్తున్నాం. ఇది చాలా ఫ్రెష్ స్టోరీ. ఫన్ అండ్ హీరోయిజం కలగలిపిన స్టోరీ' అని కోన వెంకట్ వెల్లడించారు.

Ram Charan's Film with Crazy Director

కోన వెంకట్ చెప్పిన ఆ దర్శకుడు ఎవరు? అనే విషయం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. బహుషా అతడు కిక్, రేసు గుర్రం చిత్రాల ఫేం సురేందర్ రెడ్డి అయి ఉంటాడని అనుమానిస్తున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పడుతుందని అంటన్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ శ్రీను- వైట్ల సినిమా ఇంకా మొదలు కానే లేదు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయి విడుదల కావడానికి కనీసం ఆరు నెలల టైం పడుతుంది. దీని తర్వాత పైన మాట్లాడుకున్న సినిమా పూర్తయి విడుదల కావడానికి 2016 వస్తుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X