twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంజాయ్: 2 నెలలు రామ్ చరణ్ ఫారిన్ టూర్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు రెండు నెలల పాటు పారిన్ టూర్ ప్లాన్ చేసాడు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో సినిమాలేవీ లేక పోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయాన్ని పూర్తిగా విదేశాల్లో గడపాలనుకుంటున్నాడు. రామ్ చరణ్ వెంట ఆయన భార్య ఉపాసన కూడా వెలుతున్నట్లు టాక్. రెండు నెలల హాలిడే పూర్తయిన తర్వాతే రాంచరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడనే విషయాన్ని ఎనౌన్స్ చేస్తాడని సమాచారం.

    వాస్తవానికి ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం తర్వాత ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆగడు' చిత్రం ప్లాపు కావడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. శ్రీను వైట్లను స్క్రిప్టులో మార్పులు చేయాల్సిందిగా రామ్ చరణ్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీను వైట్ల మార్పులు, చేర్పులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

    ‘గోవిందుడు అందరి' వాడేలే చిత్రానకి సంబంధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ. 3 కోట్లు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు రూ. 40 కోట్ల షేర్ వసూలు చేసినప్పటికీ హెవీ బడ్జెట్ కారణంగా కొంత నష్టాలు వచ్చినట్లు టాక్. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

     Ram Charan's Foreign Tour in cards

    రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరరెక్కిన ‘గోవిందుడు అందరి వాడేలే' తొలిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది.

    ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ చరణ్ నటించారు. కొన్ని కారణాల విడిపోయిన తన కుటుంబ సభ్యులను కలపడానికి హీరో ఏం చేసాడు? అనే పాయింటుతో సాగిన స్టోరీకి ఫ్యామిలీ అనుబంధాలు, ఆప్యాయతలు, ఎమోషన్స్, బావామరదళ్ల సరసాలు యాడ్ చేసి వినోదాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణ వంశీ.

    ప్రకాష్ రాజ్, జయసుధ, రహహాన్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ, నిర్మాత : బండ్ల గణేష్.

    English summary
    Film Nagar source said that, Ram Charan's 2 months Foreign Tour in cards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X