రామ్ చరణ్ కేక...హిట్ ఫిక్స్(వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌, కాజల్‌ జంటగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం ట్రైలర్ విడుదలై మెగా అభిమానులను ఓ రేంజిలో అలరిస్తోంది. ఇందులో రామ్ చరణ్ విన్యాసాలు, భావోద్వేగాలను కృష్ణవంశీ పండించిన తీరు చూసిన వారు...ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. బండ్ల గణేష్‌ నిర్మాత. యువన్‌శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో భాగంగా ఈ కొత్త టీజర్ ని విడుదల చేసారు. మీరూ ఓ లుక్కేయండి

''సినీ పరిశ్రమకు దూరమై రాజకీయాల్లోకి వచ్చినందుకు ఏనాడూ బాధ పడలేదు. దానికి కారణం రామ్‌చరణ్‌. తనలో నన్ను నేను చూసుకొంటున్నా. అందుకే సినిమాలకు దూరమైన లోటు కనిపించలేద''న్నారు చిరంజీవి. ఆయన 'గోవిందుడు అందరివాడేలే' పాటల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ట్రైలర్ ని సురేఖ, ఉపాసన విడుదల చేశారు.

Ram Charan's Govindudu Andarivadele Theatrical Trailer

దర్శకుడు మాట్లాడుతూ... ''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. రామ్‌చరణ్‌ విదేశాల్లో పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. తనవారికోసం సొంతూరికి వచ్చిన ఓ ఎన్నారై యువకుడు ఎలాంటి సందడిని సృష్టించాడన్నది ఇందులో ఆసక్తికరం. చరణ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. '' అన్నారు.

శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ. కూర్పు: నవీన్‌ నూలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X