లీక్: రామ్ చరణ్ కొత్త చిత్రం వర్కింగ్ స్టిల్స్ ( ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్: రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం సమచారం, ఫోటోలు కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం షూటింగ్ లోని వర్కింగ్ స్టిల్స్ కొన్ని లీకయ్యాయి. ఈ స్టిల్స్ లో రామ్ చరణ్, కాజల్ ఉన్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్త లుక్ తో కనిపించటం కూడా చాలా ఆసక్తిని రేపుతోంది. దానికి తోడు ఈ టైటిల్ గతంలో చిరంజీవి చిత్రం అందరివాడులోని టైటిల్ సాంగ్ నుంచి తీసుకున్నది కావటంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషపడుతున్నారు.

కృష్ణ వంశీ తన చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ కావటంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టి తానేంటో మరోసారి ఇండస్ట్రీకి ప్రూవ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత.

లీకైన ఆ ఫోటోలు మీ కోసం స్లైడ్ షోలో...

ఎన్నారైగా...

ఎన్నారైగా...

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్‌ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో అతని పాత్రలో కొంత ఆధునికత్వం,మరికొంత పల్లెటూరు అమాయికత్వం కనపడనుంది.

ఎక్కడెక్కడ

ఎక్కడెక్కడ

చిత్రం యూనిట్‌ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరింది. ఏప్రిల్‌ రెండోవారం నుంచి హైదరాబాద్‌ రామానాయుడు సినీవిలేజ్‌లో ఇల్లు సెట్‌లో, ఆర్‌ఎఫ్‌సిలో తదుపరి షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు.

పోనీ టెయిల్

పోనీ టెయిల్

చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. చిత్రం రిలీజ్ అయ్యాక ఈ పోని టెయిల్ ఫ్యాషన్ గా మారుతుందని అంటున్నారు.

అనుబంధాలు

అనుబంధాలు

తాత, మనవడుగా రాజ్‌కిరణ్‌, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. అలాగే కుటుంబ అనుబంధాలు,విలువలను ప్రత్యేకంగా ఈ చిత్రంలో ఆవిష్కరిస్తున్నారు.

పల్లెటూరు సొగుసులు

పల్లెటూరు సొగుసులు


చాలాకాలం తర్వాత తెలుగు తెరపై పల్లెటూరు సొగుసులు ఈ సినిమాలో కనిపిస్తాయంటున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...

''తెలుగుదనం ఉట్టిపడే కథ కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే కన్యాకుమారి, పొల్లాచ్చి, రామేశ్వరంలో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. హైదరాబాద్‌ రామోజీఫిల్మ్‌సిటీలో షెడ్యూల్‌ చేస్తున్నాం. విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. రామ్‌చరణ్‌, రాజ్‌కిరణ్‌, శ్రీకాంత్‌ల మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు.. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొనేలా ఉన్నాయి'' అన్నారు.

మాస్ కు కూడా...

మాస్ కు కూడా...

కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్‌ శైలికి తగ్గ మాస్‌ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ ని అలరించే ఎలిమెంట్స్ కు సైతం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్తున్నారు.

ఎవరెవరు..

ఎవరెవరు..

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X