»   » హార్ట్ టచింగ్: జాని మాస్టర్‌కు రామ్ చరణ్ హెల్ఫ్!

హార్ట్ టచింగ్: జాని మాస్టర్‌కు రామ్ చరణ్ హెల్ఫ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ నటించిన రచ్చ, నాయక్, ఎవడు, బ్రూస్ లీ చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన జాని మాస్టర్ రామ్ చరణ్ గురించి ఆసక్తిక విషయం వెల్లడించారు. రామ్ చరణ్ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన ఎంతో మంచి వాడని, తనకు కష్ట సమయంలో చేసిన సహాయం గురించి ఇటీవల ఓ ఒంటర్వ్యూలో జాని మాస్టర్ వెల్లడించారు.

తన భార్య ప్రెగ్నెన్సీ సమయంలో సమయంలో చాలా ప్రాబ్లం అయింది, హాస్పటల్ ఖర్చు భారీగా అయింది. ఆ సమయంలో రామ్ చరణ్ నాకు రూ. 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. రామ్ చరణ్ ఒక మాట చెప్పగానే అపోలో ఆసుపత్రిలో నా భార్య, కొడుకు విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు అని జానీ మాస్టర్ వెల్లడించారు.

రామ్ చరణ్ తన అనుకున్న వారి కోసం ఎలాంటి సహాయం అయినా చేయడానికి అయినా సిద్దంగా ఉంటారు అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. తనతో కలిసి పని చేసే వారితో రామ్ చరణ్ మంచి రిలేషన్ ఫిప్ మెయింటేన్ చేస్తారు. అందరినీ కలుపుకుపోతారు. ఆయనకు ఒక్కసారి కనెక్ట్ అయితే చాలు చాలా సపోర్టుగా ఉంటారు అని తెలిపారు.

దర్శకుడు రాజమౌళి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లకు తాను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానని చెప్పుకొచ్చారు. రాజమౌళి గారి వల్ల తాను వర్క్ నేర్చుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు వర్క్ విషయంలో నన్ను చాలా బాగా గైడ్ చేసారు. రామ్ చరణ్ నాకు పని ఇచ్చారు....అంటూ ఈ ముగ్గురి విషయంలో జానీ మాస్టర్ కాస్త ఎమోషనల్ గా స్పందించారు.

English summary
Dancer choreographer Jani revealed how Ram Charan has helped him with the hospital charges of 5 Lakhs, when his wife had a problem during pregnancy. His wife and son were specially taken care at Apollo hospitals, after Charan said a word.
Please Wait while comments are loading...