»   »  ఉపాసన ‘బి పాజిటివ్’ కోసం చరణ్ ఇంటర్వ్యూ.. (ఫోటోలతో)

ఉపాసన ‘బి పాజిటివ్’ కోసం చరణ్ ఇంటర్వ్యూ.. (ఫోటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ సతీమణి ఉపాసన చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ‘బి పాజిటివ్' హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్ మేగజైన్ ఏప్రిల్ ఎడిషన్ కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏప్రిల్ నెల సంచిక కవర్ పేజీపై రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి దర్శనమిచ్చారు.

నేను ఇప్పటికీ అమ్మ చాటు పిల్లాడినే, అమ్మకు నేనే ఫేవరెట్ అంటూ రామ్ చరణ్ తన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. తన కుటుంబానికి సంబంధించని విషయాలతో పాటు తన డైట్ ప్లాన్, జిమ్ షెడ్యూల్, ఫేవరెట్ ఫుడ్, సినిమాలుతో పాటు తనకు సంబంధించిన అనేక విషయాలు చెప్పుకొచ్చారు.

చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన విషయాలు కూడా రామ్ చరణ్ తన ఇంటర్వ్యూలో ప్రస్తావించడం గమనార్హం. 150వ సినిమా కోసం నాన్న ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుని ఫ్రెష్ లుక్ తో కనిపించబోతున్నారనే రామ్ చరణ్ మాటలు అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. రామ్ చరణ్ చెప్పుకొచ్చిన కొన్ని విషయాలు స్లైడ్ షోలో...

తల్లి సురేఖతో కలిసి రామ్ చరణ్

తల్లి సురేఖతో కలిసి రామ్ చరణ్


‘బి పాజిటివ్' మేగపైన్ కవర్ పేజీపై రామ్ చరణ్ ఇలా తన తల్లితో కలిసి దర్శనమిచ్చారు.

తన గుర్రంతో రామ్ చరణ్

తన గుర్రంతో రామ్ చరణ్


రామ్ చరణ్ కు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో తన ఫేవరెట్ గుర్రంతో కలిసి రామ్ చరణ్.

ఎక్స్ క్లూజివ్ స్టిల్స్

ఎక్స్ క్లూజివ్ స్టిల్స్


ఈ మేగజైన్లో రామ్ చరణ్ కు సంబంధించి పలు ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ కూడా ఉన్నాయి.

నేను అమ్మ ఫేవరెట్

నేను అమ్మ ఫేవరెట్


తన తల్లితో తనకున్న అనుబంధం గురించి రామ్ చరణ్ ప్రస్తావిస్తూ..అమ్మకు నేను ఫేవరెట్, నాకు ఇష్టమైనవన్నీ వండిపెడుతుంది. తన డైట్ ప్లాన్, జిమ్ ప్లాన్ గురించి రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

ఆసక్తికర విషయాలు

ఆసక్తికర విషయాలు


తనకు సంబంధించన అలవాట్లు, అభిరుచులు ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.

ఉపాసన హెడ్

ఉపాసన హెడ్


బి పాజిటివ్ మేగజైన్ కు ఉపాసన హెడ్. హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్ మేగజైన్ ఇది.

హాట్ కేకులు

హాట్ కేకులు


రామ్ చరణ్ కవర్ పేజీతో రావడం, ఉపాసన నడిపిస్తున్న మేగజైన్ కావడంతో ఇవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట.

Read more about: ram charan, upasana kamineni
English summary
Ram Charan was seen posing with his mother, Surekha, for the April edition of B Positive magazine. Surekha, though have had enjoyed all the giltz and glam, being the wife of Megastar Chiranjeevi, she was never seen posing for the shutters.
Please Wait while comments are loading...