»   » ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ లోగో రిలీజ్ చేసిన చెర్రీ (ఫోటో)

‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ లోగో రిలీజ్ చేసిన చెర్రీ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. చిరంజీవి 150వ సినిమాతో నిర్మాతగా మారుతున్న రామ్ చరణ్ 'కొణిదెల ప్రొడక్షన్స్' పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పాడు.

Konidela Production Company Logo

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లోగోను తాజాగా రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా రిలీజ్ చేసాడు. హనుమాన్ బొమ్మతో ఉన్న ఈ లోగో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదే బేనర్లో చిరంజీవి 150వ సినిమా నిర్మాణం కాబోతోంది.

150వ సినిమా ప్రారంభ కార్యక్రమం ఈ రోజు(ఏప్రిల్ 29) మధ్యాహ్నం గం.1.30 ని.లకు జరగనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న వివి వినాయక్ అంతర్వేదిలో లక్ష్మీనరసింహా స్వామి వద్ద చిరు 150వ సినిమా స్క్రిప్ట్‌ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ రోజు మధ్యాహ్నం గ్రాండ్ గా చిరంజీవి 150వ సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగా హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. మే నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేల్ పనిచేస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

English summary
Here is the logo of Ram Charan's production house - Konidela Production Company. This logo has the drawing of Lord Hanuman (the favorite God of Chiranjeevi) inscripted in white in the background of saffron color. Chiranjeevi's 150th film (tentativey titled as Kathilantodu) is going to be made on this producti
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu