రచ్చ లేపనున్న రామ్ చరణ్ ఫైట్లు...!
రామ్ చరణ్ తేజ త్వరలో రచ్చ సినిమా తో ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రం ఇప్పటికే శ్రీ లంక, బాంగ్ కాక్ నగరాలలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో ఏక్షన్ సీన్లు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి అని చిత్ర నిర్మాణ వర్గం చెబుతోంది. రామ్ చరణ్ చేసిన చిత్రాల్లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుందని రామ్ చరణ్ తేజ్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.
పూరి జగన్నాథ్, రాజమౌళి, భాస్కర్ డైరెక్షన్ లో తొలి మూడు సినిమాలు చేసిన రామ్ చరణ్ ఫస్ట్ టైమ్ 'ఏమైంది ఈవేళ" వంటి ఓ చిన్న చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సంపత్ నంది దర్సకత్వం లో రూపొందుతున్న చిత్రంలో చరణ్ ,తమన్నా జంట గా నటిస్తున్నారు. సంపత్ నంది చెప్పిన కథ, స్ర్కీన్ చాలా ఫ్రెష్ గా వున్నాయని టేకింగ్ అద్భుతంగా వుందని చరణ్ కితాబు ఇస్తున్నాడు. చిత్రానికి మాటలు పరుచూరి బ్రదర్స్, పాటలు మణిశర్మ అందిస్తున్నారు. ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే ఈ చిత్రం సంక్రాంతి సెలవులకు విడుదలకు సిద్ధం చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











