twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ న్యూ రికార్డ్...బాబాయ్ పవన్ వెనక్కి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. చరణ్ జోరుకు బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా వెనక పడి పోయాడు. చరణ్ నటిస్తున్న 'నాయక్' చిత్రం రైట్స్ కర్నాటకలో భారీ రేటుకు అమ్ముడు పోయాయి. గాయిత్రి ఫిలింస్ సంస్థ ఈచిత్రం రైట్స్ రికార్డు స్థాయిలో రూ. 4.10 కోట్లు కొన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సినిమా చరిత్రలో ఒక తెలుగు సినిమా కర్నాటకలో ఇంత భారీ రేటుకు అమ్ముడు పోవడం ఇదే తొలి సారి.

    ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం గుంటూరు మినహా అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి రికార్డు స్థాయి రేటు పలికిందని తెలుస్తోంది. పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ 'నాయక్' బిజినెస్ కేక పుట్టిస్తోంది. అభిరామ్ మూవీస్ సంస్థ వారు నాయక్ సినిమా హక్కులను ఆల్ టైం రికార్డ్ రేటుకు దక్కించుకున్నారు. మరో వైపు యూకె-యూరఫ్ రైట్స్ ఎరాబస్ వారు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    నెల్లూరు ఏరియా రైట్స్ భరత్ పిక్చర్స్ సొంతం చేసుకుంది. సీడెడ్ ఏరియా రైట్స్ శోభు దక్కించుకున్నారు. కృష్ణ జిల్లా థియేటర్స్ రైట్స్ ను శక్తి ఫిల్మ్స్ వారు కొనుగోలు చేసారు. దాసరి నారాయణకు చెందిన సిరి మీడియా దాదాపు రూ. 10.5 కోట్లు వెచ్చించి నైజాం ఏరియా రైట్స్ తీసుకున్నారు. అదే విధంగా వి. రావు, చల్ల శంకర్ రావు, తులసి పిల్మ్స్ వారు వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి హక్కులు భారీ రేటుకు సొంతం చేసుకున్నారు.

    నాయక్ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డివివి దానయ్య నిర్మాత. బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

    English summary
    
 Mega power star Ram Charan Nayak film's Karnataka rights have been reportedly picked up for a record price. Sources say that the Karnataka rights of Nayak has been bagged by Gayathri Films for a whopping 4.10 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X