మహేష్ బాబు రికార్డ్ బద్దలు కొట్టిన రామ్ చరణ్!

By Bojja Kumar

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన స్టామినా ఏమిటో మరోసారి నిరూపించాడు. ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన ఈ యంగ్ హీరో....సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ విషయంలో అధిగమనించాడు. రామ్ చరణ్ నటిస్తున్న 'నాయక్' చిత్రం గుంటూరు రైట్స్ విషయంలో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.

ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం కాశి అనే డిస్ట్రిబ్యూటర్ ఈచిత్రం గుంటూరు జిల్లా రైట్స్ రూ. 3.75 కోట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గుంటూరు బాక్సాఫీసు చరిత్రలో ఈ రేంజిలో కలెక్షన్లు రావడం ఇదే తెలిసారి. నిన్నమొన్నటి వరకు ఈ రికార్డు మహేష్ నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం పేరుతో ఉండేది. కొన్ని రోజుల క్రితం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం గుంటూరు జిల్లా థియేట్రికల్ రైట్స్ రూ. 3.5 కోట్లకు అమ్ముడయ్యాయి. తాజాగా ఆ రికార్డు 'నాయక్'లా వచ్చి బద్దలు కొట్టాడు చెర్రీ.

వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాయక్‌' చిత్రానికి 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో కాజల్‌, అమలా పాల్‌ హీరోయిన్ గా చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య. సంక్రాంతి కానుకగా జవవరి 9, 2013న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రాన్ని యూనివర్శల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సత్యం రాజేష్‌, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X