వినాయిక్ కోసం రామ్ చరణ్ ఫైటింగ్

By Srikanya

బద్రీనాధ్ తో ప్లాప్ లో ఉన్న వివి వినాయిక్ తాజాగా రామ్ చరణ్ తో ఓ చిత్రం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, వివి వినాయిక్ కాంబినేషన్ లో రూపొందే ఈ కొత్త చిత్రం షూటింగ్ మొదలైంది. హైదరాబాద్‌ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నారు. కణల్‌ కన్నన్‌ నేతృత్వంలో యాక్షన్‌ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ బ్యానర్ పై నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.

ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...చరణ్‌ని ఒక కొత్త తరహా పాత్రలో చూపెట్టబోతున్నారు దర్శకుడు. వినోదం, యాక్షన్‌... తదితర అంశాలు అభిమానుల్ని మెప్పించేలా ఉంటాయి. వాణిజ్య విలువలతో కూడిన కథాంశమిది. వినోదాత్మకంగా సాగుతుంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ కథలో మరో నాయికకీ స్థానం ఉంది. ఆమె ఎవరనేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ చేస్తోంది.'మగధీర' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిదే. సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు: ఆకుల శివ,ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X