ఎండ్ల బండిలో తాతతో కలిసి రామ్‌చరణ్
హైదరాబాద్:చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్. తాత, మనవడుగా రాజ్‌కిరణ్, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
రామ్ చరణ్ తొలిసారిగా పల్లెటూరి నేపథ్యమున్న యువకుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ నెల 26 వరకు పొల్లాచ్చిలోనే చిత్రీకరణ కొనసాగుతుంది. అనంతరం హైదరాబాద్‌లో రూపొందించిన సెట్‌లో కుటుంబ నేపథ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.
మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. ''కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్ శైలికి తగ్గ మాస్ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి''అని నిర్మాత చెబుతున్నారు. నలభై రోజులపాటు ఈ షెడ్యూల్ సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు తండ్రిగా నాగార్జునని అడుగుతున్నారని తెలుస్తోంది. తాతగా రాజ్ కిరణ్ కనిపించనున్నాడు.
ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.


Click it and Unblock the Notifications











