పుకార్లు నమ్మకండీ ఇది సేఫ్ మూవీ...! రామ్ చరణ్ ఇలా చెప్పాడు మరి

సుకుమార్ దర్శకత్వంలో నేను చేయబోయే సినిమా గురించి వస్తున్న ఊహగానాల్ని నమ్మొద్దు. ఇదొక సేఫ్ మూవీ'' అని స్పష్టం చేశాడు చరణ్.

సుకుమార్ సినిమాలంటే అదో రకం. క్లాస్ ప్రేక్షకులకు బాగా కనెక్టవుతాయి కానీ.. మాస్ ప్రేక్షకుల్ని పూర్తిగా మెప్పించవు. పైగా చరణ్ చేయబోయేది ప్రయోగాత్మక సినిమా అని.. ఇందులో అతను చెవిటివాడిగా కనిపిస్తాడని.. ఇంకోటని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అప్పట్లో స్టార్ హీరోలు సైతం అవిటివారుగా, అంధులుగా, అంద వికారులుగా రకరకాల పాత్రల్లో చేసి మెప్పించేవారు.

అయితే యంగ్ జనరేషన్ లో ఎవరూ అటువంటి సాహసాలు చేయటం లేదు. హీరో అంటే ఎప్పుడూ అందంగా, మంచివాడుగా ఉంటూ మంచిని రక్షిస్తూ కాలం గడుపుతూండే ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగు సినిమా సీన్ మారుతోంది. కొత్త తరహా పాత్రలకు ప్రాణం పోయాలని హీరోలు ఉత్సాహం చూపుతున్నారు. నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ ..టెంపర్ లో మెప్పించారు. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ ...చెవిటి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. పుట్టుక తోటే కొద్ది పాటి చెవుడుతో ఈ పాత్ర ని దర్శకుడు సుకుమార్ స్పెషల్ గా డిజైన్ చేసారట. సినిమా మొత్తం రగ్గడ్ లుక్ తో, కొద్దిపాటి గెడ్డంతో రామ్ చరణ్ కనిపించనున్నారు.

 Ram Charan’s next film with Sukumar to be a romantic flick

ఈ నేపథ్యంలో 'ధృవ' తర్వాత మరోసారి మాస్ ప్రేక్షకులకు నిరాశ తప్పదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే తన మాస్ ఫ్యాన్స్ లో ఉన్న ఈ ఆందోళనను గమనించిన చరణ్.. సుకుమార్ సినిమా విషయంలో కంగారు పడాల్సిన పని లేదంటూ చరణ్ భరోసా ఇచ్చాడు. ''సుకుమార్ దర్శకత్వంలో నేను చేయబోయే సినిమా '1 నేనొక్కడినే' తరహాలో సైకలాజికల్ డ్రామా కాదు. 'నాన్నకు ప్రేమతో' తరహాలో ఫారిన్ స్టయిల్ ఉండదు. 'ఆర్య-2' లాగా టిపికల్ క్యారెక్టరైజేషన్ ఉండదు. ఇది ఒక గ్రామీణ కథ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులూ కనెక్టయ్యే కథ ఇది. ఈ సినిమా గురించి వస్తున్న ఊహగానాల్ని నమ్మొద్దు. ఇదొక సేఫ్ మూవీ'' అని స్పష్టం చేశాడు చరణ్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే సుకుమార్ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఈపరిస్థితుల్లో ఈ సినిమా కథాంశం ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇది గ్రామీణ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశమనేది టాలీవుడ్ వర్గాల సమాచారం. కోనసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ కొనసాగుతుందనీ.. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపిస్తాడని సినీవర్గాలు అంటున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ కథను సుకుమార్ సిద్ధం చేశాడట.కాబట్టి మెగా మాస్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదేమో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X