రామ్ చరణ్ కమిటయిన రెండు చిత్రాలు ఇవే...
ఆరెంజ్ ప్లాప్ తర్వాత ఆచితూచి అడుగువేస్తున్న రామ్ చరణ్ తాజాగా రెండు చిత్రాలు కమిటయ్యినట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. అవి వివి వినాయిక్ దర్శకత్వంలోనూ,సంపత్ నంది దర్శకత్వంలోనూ చేయనున్న చిత్రాలు. జులైలో వివి వినాయిక్ తో చేయబోయే చిత్రం సెట్స్ మీదకు వెళ్ళుతుంది. వినాయక్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'బద్రీనాథ్' చిత్రం చేస్తున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆ తరవాత చరణ్ సినిమాకి మొదలెడతారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.అలాగే వినాయక్ సినిమాతోపాటు మరో చిత్రంలోనూ చరణ్ నటిస్తారు.
'ఏమైంది ఈ వేళ'తో దర్శకుడిగా పరిచయమయ్యారు సంపత్ నంది. సంపత్ చెప్పిన కథ చరణ్‌కి నచ్చింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేయనుంది. ఈ సినిమాని మెగాసూపర్‌గుడ్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాకి 'రచ్చ' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇక రామ్‌చరణ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. మియామీలోని డేవిడ్ బార్టన్ అనే వ్యాయామ శిక్షకుడి దగ్గర ఆయన ప్రత్యేకంగా తర్ఫీదు తీసుకొంటున్నారు. సిక్స్ పాక్ బాడీ కోసం వ్యాయామాలు చేస్తున్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











