ఓ రేంజిలో జరుగుతున్న 'ఆరెంజ్‌' షూటింగ్

By Srikanya

తొలిషెడ్యూల్‌ను ముంబయ్‌లో పూర్తిచేసి ఆస్ట్రేలియాలో ఓ భారీ షెడ్యూల్‌ను జరుపుకున్న 'ఆరెంజ్‌' సినిమా తాజా షెడ్యూల్‌ మరోసారి ఈ నెల 21 నుంచి ముంబయ్‌లో జరుగుతోంది. చరణ్‌, షాజన్‌ పదంసిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 31వరకు అక్కడ చిత్రీకరణ కొనసాగుతుంది. అంజనా ప్రొడక్షన్స్‌ పతాకంపై కె.నాగేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ షాజన్‌, జెనీలియా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. 'ఆరెంజ్‌'కు హేరిస్ ‌జైరాజ్ ‌ను స్వరాలు సమకూరుస్తున్నారు. 'మగధీర' లాంటి సంచలన విజయం తర్వాత రామ్‌ చరణ్‌ నటిస్తున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. బ్రహ్మానందం, ప్రభు, సుమన్‌, ప్రగతి, కిషోర్‌, ప్రణీత్‌, కల్పిక తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ ‌రెడ్డి, సంగీతం: హేరిస్‌ జైరాజ్‌, ఆర్ట్‌: ఆనందసాయి, స్టంట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంభాషణలు: తోట ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: మన్యం రమేష్‌. సమర్పణ: కొణిదెల వెంకట్రావు. ఇక రామ్ చరణ్ తాజాగ ధరణి దర్శకత్వంలో 'మెరుపు' అనే చిత్రం చేయటానికి కమిట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X