‘స్పైడర్’ నష్టాలతో షాక్: నిర్మాతకు రామ్ చరణ్‌ అభయం!

స్పైడర్ సినిమా తర్వాత నష్టాల పాలైన నిర్మాత ఎన్వీ ప్రసాద్ కు రామ్ చరణ్ అభయం ఇచ్చారట.

By Bojja Kumar

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'స్పైడర్' మూవీ నిర్మాతలకు ఊహించని ఫలితాలు ఇచ్చింది. మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. ఈ సినిమా ద్వారానే మహేష్ బాబు తొలిసారిగా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా షాకిచ్చే ఫలితాలు ఇచ్చింది.

ఈ చిత్రాన్ని నిర్మించిన ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్‌లకు ఫైనాన్షియల్‌గా ఈ చిత్రం పెద్ద దెబ్బే అని చెప్పక తప్పదు. అయితే ఇద్దరూ ఈ నష్టాలను పూడ్చుకోవాలంటే మరో స్టార్ హీరోతో సినిమా చేసి హిట్టు కొట్టడం తప్ప మరో ఆప్షన్ లేదు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఇప్పటికే తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

 నిర్మాతకు అభయమిచ్చిన చరణ్

నిర్మాతకు అభయమిచ్చిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ఎన్వీ ప్రసాద్ డీల్ ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్వీ ప్రసాద్ మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. ఆయన స్వయంగా వచ్చి అడగటంతో తప్పకుండా సినిమా చేసి పెడతానని మాట ఇచ్చారట చరణ్.

 ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు

ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు

అయితే ఏ సినిమా, ఏ దర్శకుడు అనే విషయం మాత్రం ఖరారు కాలేదు. కేవలం తనకు ఆప్తుడైన నిర్మాత కావడంతో ఆయన్ను నష్టాల నుండి గట్టెంక్కించడానికి రామ్ చరణ్ అభియమిచ్చినట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

 హిట్ సినిమాలు

హిట్ సినిమాలు

ఇంతకు ముందు రామ్ చరణ్ నటించిన హిట్ సినిమాలైన రచ్చ, ధృవ లాంటి చిత్ర నిర్మాణంలో ఎన్వీ ప్రసాద్ భాగస్వామ్యం ఉంది. ఇపుడు చరణ్‌తో నేరుగా సినిమా చేసే అవకాశం ఆయనకు వచ్చింది.

ఈ సినిమా ఎప్పుడు ఉండొచ్చు?

ఈ సినిమా ఎప్పుడు ఉండొచ్చు?

ప్రస్తుతం రామ్ చరణ్- సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం 1985' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఇవి పూర్తయిన తర్వాత ఎన్వీ ప్రసాద్ బేనర్లో చరణ్ సినిమా ఉండే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X