రామ్ చరణ్ ‘రచ్చ’ ఆడియో సంక్రాంతి, విడుదల శివరాత్రికి....!?
రామ్ చరణ్ తేజ నాన్ స్టాప్ గా రచ్చ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. వరుస సినిమాలు ఒప్పుకుంటున్న చెర్రీ తన పంథా మార్చుకుంటున్నాడు. శరవేగంగా రచ్చ చిత్రాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అన్నట్టు రామ్ చరణ్ టాలీవుడ్ లో ఇప్పటివరకు చేయని లొకేషన్స్ లో రచ్చ షూటింగ్ చేస్తున్నాడు... ఇంతకూ చెర్రీ ఎక్కడున్నాడు.?
మెగా పవర్ స్టార్ ఇటీవలే చిరంజీవి గ్యాంగ్ లీడర్ లోని వాన పాట రీమిక్స్ లో తమన్నాతో కలిసి స్టెప్పులేశాడు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన అందమైన సెట్లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో తనయుడు చెర్రీ ఇరగదీశాడని చిరంజీవి ఆనందంతో మురిసిపోతున్నాడు. ఇక టాలీవుడ్ లో ఇప్పటివరకు చేయని లొకేషన్స్ లో ఈ చిత్ర షూటింగ్ చేసేందుకు దర్శకుడు సంపత్ నంది ప్లాన్ చేశాడు.
ప్రస్తుతం చైనాలో రచ్చ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చైనాలోని అద్భుతమైన దట్టమైన అడవుల్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ ఓ ఫైట్ సీక్వెన్స్ తో పాటు... ఓ పాటను చిత్రీకరిస్తారు. ఈనెలాఖరు వరకు చైనాలోనే షూటింగ్ జరుగుతుంది. దాదాపు 60%షూటింగ్ పూర్తి చేసుకొన్నది. యాక్షన్ సీక్వెన్స్ ను స్టంట్ డైరెక్టర్ అలన్ అమీన్ సారధ్యంలో చిత్రీకరించనున్నారు.
చైనా ట్రిప్ తర్వాత డిసెంబర్ 1న జరగనున్న చరణ్-ఉపాసనల ఎంగేజ్ మెంట్ కోసం బ్రేక్ తీసుకోనున్నాడు. తర్వాత 2012సంక్రాంతికి మెగా సూపర్ గుడ్ మూవీ ద్వారా 'రచ్చ" ఆడియోను రిలీజ్ చేయనున్నారని తాజాగా అందిన సమాచారం. అలాగే చిత్రాన్ని మహా శివరాత్రి ఫిబ్రవరి 20న విడుదల చేయుటకు ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు...!


Click it and Unblock the Notifications











