రచ్చ కథ ఆషామాషీ కాదు, మూడు నెలలు కష్టపడ్డాం: రామ్ చరణ్

By Pratap

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రచ్చ'. తమన్నా కథానాయిక. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తారు. మెగా సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఎన్‌.వి.ప్రసాద్‌, పారస్‌ జైన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్‌.బి.చౌదరి సమర్పకులు. ఈ చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్‌నిచ్చారు. సురేష్‌బాబు స్విచ్చాన్‌ చేశారు. అనంతరం రామ్‌చరణ్‌ మాట్లాడుతూ ''ఈ కథ కోసం మూడు నెలలుగా కష్టపడుతున్నాం. ఇందులో నా పాత్ర తీరు తెన్నులు బాగా నచ్చాయి. పూర్తి వాణిజ్య విలువలున్న చిత్రమిది. అభిమానుల్ని ఉత్సాహపరిచే అంశాలున్నాయి. నాన్నగారి హిట్‌ సినిమాలకు పరుచూరి బ్రదర్స్‌ కథ అందించారు. ఈసారి వాళ్లతో నేను పనిచేయడం ఆనందంగా ఉంది. 'గ్యాంగ్‌ లీడర్‌'లో పాటని రీమిక్స్‌ చేస్తామా? లేదా? అని ఇప్పుడే చెప్పలేను'' అన్నారు.

తమన్నా చెబుతూ ''ఈ యేడాది నాకు అదృష్టం కలిసొచ్చింది. మంచి మంచి అవకాశాలు అందుకొంటున్నాను. రామ్‌చరణ్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు సంపత్‌ ఈ కథ చెప్పగానే నచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సినిమా వదులుకోకూడదు అనిపించింద''ని చెప్పింది. ''చిరంజీవి నటించిన 'ఘరానామొగుడు', 'ముఠామేస్త్రి'ల్లానే ఇది కూడా వాణిజ్య విలువలతో నిండిన చిత్రం. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపు. తప్పకుండా అందరినీ అలరిస్తుంద''ని పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. ''చరణ్‌ని ప్రేక్షకులు ఎలా చూడాలనుకొంటున్నారో... ఈ సినిమాలో అలా చూస్తారు. 'ఏమైంది ఈ వేళ' తరవాత ఇంత పెద్ద అవకాశం రావడం సంతోషంగా ఉంది. నా మీద ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకొంటా''నని దర్శకుడు చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ ''ఉత్తమ సాంకేతిక నిపుణులతో కలిసికట్టుగా ఓ మంచి సినిమా తీస్తాం. చిరంజీవికి ఓ బహుమతి అందిస్తాం. సోమవారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతామ''న్నారు. ప్రకాష్‌రాజ్‌, ముఖేష్‌రుషి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X