పవన్ కల్యాణ్‌కు ధీటుగా రాంచరణ్.. రిలీజ్‌కు ముందే రంగస్థలం రికార్డు
దర్శకుడు సుకుమార్, మెగా హీరో రాంచరణ్ కాంబినేషన్‌లో విభిన్నకథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న రంగస్థలం చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొంటున్నాయి.
Recommended Video

దర్శకుడు సుకుమార్, మెగా హీరో రాంచరణ్ కాంబినేషన్‌లో విభిన్నకథా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న రంగస్థలం చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వేసవి బరిలో రానున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులను తిరుగరాస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్
రంగస్థలం సినిమా బిజినెస్ గురించి ట్రేడ్ అనలిస్టులు వెల్లడిస్తున్న సమాచారం ఈ చిత్రం ఏకంగా రూ.18 కోట్లకు శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

పవన్ సినిమా శాటిలైట్ హక్కులు
నాన్ బాహుబలి చిత్రాల క్యాటగిరీలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం శాటిలైట్ హక్కులు రూ.21 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇప్పటివరకు టాలీవుడ్‌లో అత్యధికంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పుకొంటున్నారు.

పవన్ తర్వాత రాంచరణ్
పవన్ కల్యాణ్ తర్వాత మళ్లీ ఆ రికార్డును అబ్బాయి రాంచరణ్ సినిమా సొంతం చేసుకోవడం విశేషం. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు పవన్, చరణ్‌లదే రికార్డుగా చెప్పుకొంటున్నారు.

మార్చి 29న రంగస్థలం
సమంత, అనసూయ నటిస్తున్న ఈ చిత్రం మార్చి 29న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ప్రస్తుతం శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రంపై మీడియాలో సానుకూల ప్రచారం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications