వీడు నా తమ్ముడు.. పవన్ ఎమోషనల్.. చెర్రీని ముద్దులతో ముంచెత్తిన పవర్‌స్టార్

By Bojja Kumar

Recommended Video

Rangasthalam Success Meet : Pawan Kalyan Emotional Speech

రంగస్థలం సినిమా సక్సెస్ వేదిక ఎన్నో భావోద్వేగాలకు సాక్ష్యంగా నిలిచింది. ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రతో అఖండ భారతంలోని ప్రేక్షకులను ఆకట్టుకొన్న రాంచరణ్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఓ దశలో పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. రంగస్థలం సినిమా సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకొన్నది. రాంచరణ్‌తో కలిసి ఉద్వేగంగా మాట్లాడారు. పవన్ చేసిన ప్రసంగం ఇదే..

 రాంచరణ్‌లా ధైర్యం నాకు లేదు

రాంచరణ్‌లా ధైర్యం నాకు లేదు

చరణ్‌ను ఒక సంవత్సర కాలంగా చూస్తున్నాను, గడ్డం పెంచుకుని లుంగీ కట్టుకుని మురికి మురికిగా కనిపించేవాడు. అలా లుంగీ కట్టుకుని చేసే ధైర్యం నాకు లేదు. అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి, సిగ్గు వదిలేయాలి. అవన్నీ నా వల్ల కాదు. కానీ రాంచరణ్ అది సాధ్యం చేసి చూపించాడు.

 రాంచరణ్‌కు పల్లెటూరు తెలీదు

రాంచరణ్‌కు పల్లెటూరు తెలీదు

రాం చరణ్ పల్లెటూరిలో పెరుగలేదు. హైదరాబాద్, చెన్నై లాంటి సిటీల్లో పెరిగాడు. అలాంటి ఇతడికి ఈ పల్లెటూరి వాతావరణం ఎంత తెలిసి ఉంటుందో అనుకునేవాడిని. నాకు తెలిసిన చరణ్ నేలకి చాలా దగ్గర ఉండేవాడు. ఎంత ఎత్తు ఎదిగినా చాలా అణిగిమణిగి ఉండేవాడు. ఈ సినిమాలోని పాత్ర అతడి గుండెలోతుల్లో సహజత్వం ఇది. అలాంటి వ్యక్తి చరణ్. అమేజింగ్ పెర్ఫార్మర్.

పెద్దన్నయలాంటి వాడిని

పెద్దన్నయలాంటి వాడిని

రాంచరణ్‌, సుస్మితకు‌ నేను పెద్దన్నయ్య లాంటోన్నీ. బాబాయ్ కంటే అన్నాయ్యను. నేను ముసుగు తన్ని పడుకుంటే.. ఆరేళ్ల వయసులో హార్స్ రైడింగ్ నేర్చుకొనేందుకు వెళ్లేవాడు. చిన్నతనం నుంచే ఏదో నేర్చుకోవాలనే తపన.

రాంచరణ్ సంపూర్ణమైన నటుడు

రాంచరణ్ సంపూర్ణమైన నటుడు

రాంచరణ్ ఒక సంపూర్ణమైన నటుడు. నాకు నిజంగా ఆనందంగా అనిపించింది. మా ఇంట్లో ఉన్న వారు మాత్రమే కాదు బయట నటులైనా బాగా చేస్తే చాలా ఆనందించే వాడిని. అలాంటి రామ్ చరణ్ రంగస్థలంలో పుట్టి పెరిగినట్లు చాలా సహజంగా నటించాడు. రాంచరణ్ ఫెర్ఫార్మెన్స్‌ను అందరూ పొగుడుతుంటే నాకు చాలా ఆనందమేసింది.

రాంచరణ్‌కు ముద్దు పెట్టాను

రాంచరణ్‌కు ముద్దు పెట్టాను

రంగస్థలం సినిమా చూసిన వెంటనే కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాను. చాలా అద్భుతంగా చేశాడు. నాకూ కొన్ని కోరికలు ఉంటాయి. కానీ నాకు వీలు కాలేదు. కానీ వేరే వాళ్లు చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. అలాంటిది రాం చరణ్ చేస్తుంటే ఇంకా ఆనందంగా అనిపించింది.

 మగధీరుడులో అలా

మగధీరుడులో అలా

మగధీరుడులో రాంచరణ్‌ ఫెర్ఫార్మెన్స్ మరొక ఎత్తయితే.. రంగస్థలం మరో ఎత్తు. రాంచరణ్ ఆర్టిస్టిక్ మెటీరియల్. రంగస్థలం కథలో ఒదిగిపోయి గ్రామీణ యువకుడిగా కనిపించినందుకు చాలా ఆనందం కలిగింది.

 అఖండ భారతానికి

అఖండ భారతానికి

రంగస్థలం లాంటి అద్భుతమైన పాత్రలు, సినిమాలు రాంచరణ్‌కు భవిష్యతులో మరిన్ని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు రాంచరణ్ మన దక్షిణ భారతానికే కాకుండా అఖండ భారతానికి అతడి స్థాయి బలంగా వెళుతుందని నమ్ముతున్నాను. అంత సత్తా ఉన్న నటుడు. విదేశాల్లో కూడా రాంచరణ్‌కు మంచి పేరు ఉంది.

 విజయం సాధించాలని కోరుకొన్నాను

విజయం సాధించాలని కోరుకొన్నాను

రాంచరణ్ పల్లెటూరి కథలో నటిస్తుంటే విజయం సాధించాలని కోరుకొన్నాను. కొత్తగా ప్రయత్నం చేస్తున్నారని అనుకొన్నాను. ప్రతీ గ్రామంలో అందరూ అనుకొన్న విధంగానే నేను ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకొన్నాను.

చిట్టిబాబు నాకు తమ్ముడు

చిట్టిబాబు నాకు తమ్ముడు

చిట్టిబాబు అంటే నాకు తమ్ముడు లాంటోడు. వీడు నా తమ్ముడు. చరణ్‌తో చాలా తక్కువ సార్లు చనువు తీసుకొంటాను. వీడు అని చాలా తక్కువ సార్లు అంటాను. వీడు నాకు తమ్ముడు అని చరణ్‌ను ముద్దులతో ముంచెత్తాడు. వెంటనే రాంచరణ్ బాబాయ్ పవన్‌కు ముద్దు పెట్టి భావోద్వేగంలో మునిగిపోయాడు.

చిరంజీవి తండ్రి.. వదిన తల్లి

చిరంజీవి తండ్రి.. వదిన తల్లి

మా అన్నయ్య చిరంజీవి నాకు తండ్రి. మా వదిన నాకు తల్లి. వీడు గొప్ప విజయాలు సాధించాలి. రాం చరణ్ లో ఎప్పుడు అతిశయం చూడలేదు. ఎన్ని విజయాలు వచ్చి పొంగిపోలేదు. ఫెయిల్యూర్స్ వచ్చినా కుంగిపోలేదు. తన పనేదో చేసుకొంటూ ముందుకెళ్తుంటాడు. అందుకే రాం చరణ్ అంటే నాకు బాగా నచ్చుతాడు. ముందు ముందు రాంచరణ్‌కు మంచి విజయాలు లభిస్తాయి. అతడిలో అతిశయోక్తి ఉండదు. చాలా నిరాడంబరంగా ఉంటాడు. దాన్ని అలాగే కొనసాగిస్తూ మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.

 గొప్ప చిత్రమని తేల్చిన

గొప్ప చిత్రమని తేల్చిన

ఓ సమూహానికి ఉన్న తెలివితేటలు ఓ వ్యక్తికి ఉండవు. రంగస్థలం సినిమాను గొప్ప చిత్రమని తేల్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.

 సుకుమార్ కథను నడిపిన తీరు

సుకుమార్ కథను నడిపిన తీరు

సంపూర్ణ మైన నటుడికి అండగా ఉన్న సుకుమార్‌కు థాంక్స్. సుకుమార్ చేసిన విధానం, కథను నడిపిన తీరు, డైలాగ్స్ సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. పాత్రధారులు నటిస్తున్నట్లు అనిపించలేదు. జీవించినట్లు అనిపించింది. అత్తక్యారెక్టర్ చేసిన అనసూయ బాగా చేసింది. జగపతి బాబుగారు అద్భుతమైన నటన చూపించారు. ఆది పినిశెట్టి క్యారక్టర్ అద్భుతం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X