రామ్ చరణ్ రిసెప్షన్ కి ఎవరెవరు వచ్చారు?

By Srikanya

గురువారం రాత్రి హైటెక్స్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది. విందుకు పలువురు ప్రముఖలు హాజరయ్యారు. ఈ వేడుకులో పది వేలమంది పాల్గొన్నట్లు అంచనా. సినీ తారలు నాగార్జున, మహేష్‌బాబు, ప్రభాస్‌, శరత్‌కుమార్‌, సూర్య, టబు, కాజల్‌, తమన్నా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ దంపతులు, పలువురు మంత్రులు, మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ అజారుద్దీన్‌, శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, హీరో బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

బంధుమిత్రులు, ఆత్మీయులు, స్నేహితులు, ప్రముఖుల సమక్షంలో గురువారం ఉదయం 8:29 గంటలకు రామ్ చరణ్ ఉపాసన మెడలో తాళి కట్టాడు.దోమకొండ గడీని తలపించే రీతిలో కళా దర్శకుడు ఆనంద్‌సాయి రూపొందించిన కల్యాణమండపంలో కొత్త జంట కనువిందు చేసింది. ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిల్యానీ డిజైన్ చేసిన సంప్రదాయ వస్త్రాలను ధరించిన చెర్రీ, ఉపాసన ఎంతగానో ఆకట్టుకున్నారు. బంగారు, పసుపు వర్ణాలు మిళితమైన చీరకట్టుతో ఉపాసన.. సంప్రదాయ పట్టు ధోవతి కట్టుతో చరణ్ మెప్పించారు.

మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన షేర్వానీలో రామ్‌చరణ్, తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన కంజీవరం చీరలో ఉపాసన మెరిసిపోయారు. పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల దుస్తులను అనామికా ఖన్నా డిజైన్ చేయగా, పెళ్లి కొడుకు ఇంటి తరఫువారికి రాజేష్ ప్రతాప్‌సింగ్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఉపాసన తమ వంశ పారంపర్య నగలను ధరించారు. నవకాయ పిండివంటలతో, నోరూరించే భక్ష్య భోజ్యాలతో విందు కార్యక్రమాన్ని నిర్వహించారు.

తెలుగువారి సంప్రదాయ రీతిలో సుమారు మూడుగంటల సాగిన పెళ్లి తంతును బంధుమిత్రులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో సాయంత్రం రిసెప్షన్ వేడుకలు కూడా అంతే ఘనంగా జరిగాయి. వివాహానికి, విందుకు హాజరైన అతిథులకు చిరంజీవి, అనిల్ కామినేని కుటుంబసభ్యులు ఆత్మీయస్వాగతం పలికారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X