అర్పితతో రామ్ చరణ్ సెల్ఫీ(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ :ఆకాశం నుంచి తారలు దిగివచ్చి కళ్లెదురుగా కనిపిస్తుంటే... సుమాలు నడిచొచ్చి సుగంధాలను వెదజల్లుతుంటే ఎలా ఉంటుందో... తాజ్‌ఫలక్‌నుమాలో జరిగిన సల్మాన్‌ సోదరి అర్పిత వివాహ వేడుక అలా జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు.. రాజకీయ నేతలు.. పారిశ్రామిక వేత్తలు.. హాజరైన ఈ వేడుక ఆద్యంతం కన్నుల పండువగా కొనసాగింది. తెలుగు నుంచి రామ్ చరణ్ సతీ సమేతంగా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇలా పెళ్లి కూతురుతో కలిసి ఇలా సెల్ఫీ లాగించారు.

వివాహ వేడుక మరోసారి గుర్తు చేసుకుంటే...

హైదరాబాద్‌ చరిత్రలో నిలిచిపోయిన ఈ భారీ వివాహవేడుక సోమవారం రాత్రి నుంచి మొదలైంది.... ఉత్తరాది సంప్రదాయం ప్రకారం మెహిందీ, సంగీత్‌తో వివాహ వేడుక ఆరంభమయ్యింది. తాజ్‌కృష్ణ హోటల్లో ఉండి..మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ సన్నిహితులు, గౌరవ అతిథులను సల్మాన్‌ఖాన్‌ స్వయంగా ఫోన్‌ ద్వారా ఆహ్వానించారు. మధ్యాహ్నంఫలక్‌నుమా ప్యాలెస్‌కు వచ్చినప్పటి నుంచి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇద్దరు సోదరులు అర్బాజ్‌ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌లకు వేడుకలో అవసరమైన పనులన్నీ అప్పగించి... పెళ్లికి వచ్చేవారికి విందు భోజనం, ఆహార పదార్థాల జాబితాను సల్మాన్‌ దగ్గరుండి చూసుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం రాత్రి బారాత్‌లోనూ హైదరాబాద్‌ బిర్యానీ వడ్డించారు.

Ram Charan's Selfie with Arpita Khan!

సల్లూభాయ్‌.. ఏక్‌బార్‌...: సల్మాన్‌ను చూసేందుకు వందల సంఖ్యలో అభిమానులు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వచ్చారు. ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. పోలీసులు లోపలికి ప్రవేశం లేదంటూ ఆపినా... వినకుండా అక్కడే ఉండిపోయారు. సల్మాన్‌ తాజ్‌ ఫలక్‌నుమాకు చేరుకోగా వందలాది మంది అభిమానులు బైకులపై ఆయనను అనుసరించారు. కండలవీరుడు... కారులో నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ప్యాలెస్‌ లోపలకు వెళ్లిపోయారు. సల్లూభాయ్‌... ఏక్‌బార్‌ అంటూ యువకులు నినాదాలు చేశారు.

పోలీసులు వారిని దూరంగా తరిమేశారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో వారు లాఠీలు ఝుళిపించడంతో యువకులు రోడ్లపై పరుగులు తీశారు. ఈలోపు వర్షం కురవడంతో తలదాచుకునేందుకు వెళ్లి మళ్లీ ప్యాలెస్‌వైపు వచ్చారు. రాత్రి పదకొండు గంటలైనా తమ సల్లూభాయ్‌ వస్తాడన్న ఆశతో యువకులు ఎదురుచూశారు ప్యాలెస్‌ పరిసర ప్రాంతాల్లో 3ప్లటూన్ల పోలీసులను మోహరించారు.

మీడియా పడిగాపులు: అర్పిత వివాహాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు, పత్రికల్లో ప్రచురించేందుకు పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధులు ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ఎవరినీ అనుమతించ వద్దంటూ సల్మాన్‌ఖాన్‌ కుటుంబ సభ్యులు ఆదేశించడంతో వారికి ప్రవేశం లభించలేదు. 9గంటల సమయంలో అందరి తరఫునా నలుగురు మీడియా ప్రతినిధులను లోపలికి తీసుకెళ్లారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X