»   » రామ్ చరణ్ షాకింగ్ మాస్ లుక్.... (ఫోటో)

రామ్ చరణ్ షాకింగ్ మాస్ లుక్.... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఫంక్షన్లో చూసి భారీ గడ్డంతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసమే రామ్ చరణ్ ఇలా భారీగా గడ్డం పెంచుతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాజాగా సుకుమార్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ మాస్ లుక్ లీకైంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విలేజ్ కుర్రాడిగా రామ్ చరణ్ మాస్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు.

చరణ్, సమంత

చరణ్, సమంత

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోందని సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

నిజమా?

నిజమా?

80ల నాటి పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని...., హీరోకు చెవుడు, హీరోయిన్ మూగ అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

స్టోరీ ఇదేనా?

స్టోరీ ఇదేనా?

హీరో పల్లెటూరి అబ్బాయి. అతడు చెవిటివాడు. అమాయకుడైన పల్లెటూరి యువకుడు పట్నంలో అడుగుపెట్టాల్సి వస్తుంది. అక్కడ ప్రయోగశాలతో చేరిన అతడిపై ఓ ప్రయోగం జరుగుతుందట. ఆ తర్వాత హీరో జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు.. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే కథ అని టాక్.

విభిన్నమైన కథ

విభిన్నమైన కథ

ఇప్పటికే పలు చిత్రాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తెలుగు సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు తీయని ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

English summary
Ram Charan appeared in his beardy look at many recent filmy events and though many expected it to be the look for Sukumar's directional, here comes out the real look. There is a leaked picture from the shooting spot of the film from Rajahmundry, where in Charan is seen as pure village chap.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu