twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ 'తుఫాన్‌' ఆడియో వెన్యూ ఫిక్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్‌చరణ్‌ తాజా చిత్రం 'తుఫాన్‌' (జంజీర్‌) నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అడాయ్‌మెహ్రా ప్రొడక్షన్స్‌, ఫ్లైయింగ్‌ టర్టిల్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రామ్‌చరణ్‌ సరసన ప్రియాంకచోప్రా నటించగా, హిందీలో సంజయ్‌దత్‌ నటించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు. ప్రకాష్‌రాజ్‌ పాత్ర కూడా సినిమాకు హైలైట్‌ అవుతుందని చెబుతున్నారు. కాగా ఈ నెల 27న ఈ చిత్రం ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

    ఇందుకోసం హైదరాబాద్‌, శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ వేడుకలో రామ్‌చరణ్‌తో పాటు హీరోయిన్‌ ప్రియాంకచోప్రా, ఇతర తారాగణంతో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొంటారని చెబుతున్నారు. ఇక ముందునుంచీ అనుకుంటున్నట్లుగానే సెప్టెంబర్‌ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నట్లు నిర్మాతలు స్పష్టం చేసారు. ఈ చిత్రంలో రాంచరణ్‌ పోషించిన పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్ర అతనికెంతో పేరు తెచ్చిపెడుతుందని నిర్మాత తెలిపారు.

    ముంబై నగరాన్ని గడగడలాడిస్తున్న ఆయిల్‌ మాఫియా ఆగడాలను అడ్డుకునే సమర్ధవంతమైన పోలీసు అధికారిగా రాంచరణ్‌ అద్భుతంగా నటించారని అంటున్నారు. ప్రియాంకచోప్రా అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. అపూర్వలఖియా ఈ చిత్రాన్ని అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దారని వారు వెల్లడించారు. ఇక తనికెళ్ల భరణి కీలక పాత్రలో కనిపించబోతున్నారని అన్నారు. ఇప్పటికే ట్రైలర్‌, ప్రమోషనల్‌ పాటకు విపరీతమైన క్రేజ్‌ వచ్చిందని అన్నారు.

    జంజీర్/తుఫాన్ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయడానికి ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసారు. అయితే సీమాంధ్రలో నెలకొన్న సమైక్యవాదుల ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో సినిమాను అనుకున్న సమాయానికి విడుదల చేస్తారా? లేదా? అనేది అనుమానంగా మారింది. సమైక్యవాదులు చిరంజీవి కుటుంబీకుల సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే 'ఎవడు', 'అత్తారింటికి దారేది' చిత్రాల విడుదల నిలిచి పోయింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణంలో తుఫాన్ సినిమాను విడుదల చేసి రిస్కు ఫేస్ చేయడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

    English summary
    The audio album of Ram Charan’s ‘Thoofan’ might be released on the 27th of this month, as per the latest reports being heard. The news has not yet received official confirmation. An announcement can be expected in the next few days about this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X