»   » పోలీస్ పవర్ ( 'తుఫాన్‌' ప్రివ్యూ)

పోలీస్ పవర్ ( 'తుఫాన్‌' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రాష్ట్రలో వేడిక్కిన పరిస్ధితులు,కోర్టు కేసులు నేపధ్యంలో రామ్‌చరణ్‌ తేజ హీరోగా నటించిన 'జంజీర్‌' ( తెలుగు 'తుఫాన్‌') ఈ రోజు పరీక్షకు కూర్చున్నట్లుగా విడుదల అవుతోంది. ఈ చిత్రం రిజల్ట్ కన్నా...రాష్ట్రంలో ఈ సినిమా ని ఎంతవరకూ రిలీజ్ అయ్యింది...అన్ని షోలు పడుతున్నాయా లేదా అన్న విషయం పైనే ఎక్కువగా తెలుగు సిని పరిశ్రమ దృష్టి పెడుతోంది. ఈ చిత్రం రిలీజ్ రిజల్ట్ పైనే తర్వాత చాలా పెద్ద చిత్రాలు ప్రయాణం పెట్టుకోనున్నాయి. ఇక సామాన్య ప్రేక్షకులు అయితే రామ్ చరణ్ ..బాలీవుడ్ ఎంట్రీ సజావుగా జరిగిందా లేదా అన్నదే ఈ చిత్రం టార్గెట్ గా భావించి ఎదురుచూస్తున్నారు.

యంగ్ పోలీస్ ఆఫీసర్ ఎసిపి విజయ్ ఖన్నా (రామ్ చరణ్) స్ట్రైయిట్ ఫార్వర్డ్ నెస్,నిజాయితీ వల్ల ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ ఎదుర్కొంటూ ఉంటాడు. హైదరాబాద్ లో అధికారంలో ఉన్న పార్టీ నేతలతో ఘర్షణ జరగడం వల్ల అతన్ని ముంబైకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ముంబైలో ఒక డిప్యూటీ కలెక్టర్ ని ఎంతో దారుణంగా హత్య చేసిన కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని విజయ్ కి అప్పగిస్తారు. ఆ తర్వాత దాని వెనుక ఆయిల్ మాఫియాని నడిపించే రుద్ర ప్రతాప్ తేజ(ప్రకాష్ రాజ్) ఉన్నాడని తెలుసుకుంటాడు. అతను విజయ్ ని తప్పించాలని చూస్తాడు. కానీ విజయ్ గోడకి కొట్టిన బంతిలా మరింత ఆవేశంతో,శక్తితో అతని సామ్రాజ్యాన్ని కూల్చే ప్రయత్నం చేసాడు. ఈ పోరులో అతనికి ఎన్నారై మాయ (ప్రియాంక చోప్రా), షేర్ ఖాన్(శ్రీ హరి) , క్రైమ్ రిపోర్టర్ జయ్ దేవ్(తనికెళ్ళ భరణి) ఎలా సాయిం చేసారనేదే మిగతా కథ.

Ram Charan's Thoofan preview

ఇక ఈ చిత్రం సూపర్ హిట్ జంజీర్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగు వారి కోసం కథలో కొన్ని మార్పులు చేసారు. ఆ మార్పులను అలాగే తెలుగులో షూట్ చేసిన సన్నివేశాలకు డైరెక్టర్ యోగి దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు. తెలుగులో వరసగా పోలీస్ కథలకు ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ఈ చిత్రం విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

రామ్‌చరణ్ మాట్లాడుతూ- తుఫాన్‌లో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు తెగు మార్కెట్ వదిలేసి హిందీలో ఎందుకు చేస్తున్నావని అనేకమంది అడిగారని, అయితే తానే ఈ పద్ధతిని మొదలుపెట్టలేదని, గతంలో నాన్న, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు చేశారని, అదేవిధంగా వారి బాటలో వెళ్లడానికి ఓ ప్రయత్నంగా ఈ చిత్రాన్ని చేశానని, అంతేకానీ ఆలిండియా లెవెల్లో పెద్దస్టార్ అయిపోవాలన్న ఆశలేమీ లేవని అన్నారు. అమితాబ్‌బచ్చన్ చేసిన పాత్రను తానుచేయగలనా అని భయపడ్డానని, ప్రాజెక్టు నచ్చకపోతే చేయ్యొద్దు అంతేకానీ, భయంతో వెనకడుగు వేయద్దని నాన్న చెప్పడంతో ఈ చిత్రాన్ని చేశానని అన్నారు.


ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, శ్రీహరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:మీత్‌బ్రదర్స్, అంజన్, చిరంతన్‌భట్, దర్శకత్వం:అపూర్వ లాఖియా.

బ్యానర్ : అదై మెహ్రా ప్రొడక్షన్స్, రామ్‌తేజ్ మోషన్ పిక్చర్స్, ఫ్లైయింగ్ టర్టిల్స్
నటీనటులు : రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, శ్రీ హరి,తణికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం : చిరంతన్ భట్ - ఆనంద్ రాజ్ ఆనంద్ - మీట్ బ్రోస్ అంజన్
స్క్రీన్ ప్లే , దర్శకుడు : అపూర్వ లఖియా
నిర్మాతలు : పునీత్ ప్రకాష్ మెహ్రా, సుమిత్ ప్రకాష్ మెహ్రా
సమర్పణ : రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ : 06 సెప్టెంబర్ 2013

English summary
Ram Charan Teja's latest outing Thoofan, which is simultaneously made in Hindi, is a remake of 1973 Hindi action-thriller film Zanjeer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu