రామ్ చరణ్ ‘తుఫాన్’ డైలాగులు లీక్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'తుఫాన్' చిత్రం స్టెంబర్ 6న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో రామ్ చరణ్ నటించిన 'జంజీర్' చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల చేస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్.
తాజాగా ఈ సినిమాలోని కొన్ని డైలాగులు లీక్ అయ్యాయి.
-ఏదైనా చెప్పి చెయ్యడం నా స్టైల్
-ఒరేయ్ నేను చచ్చే రకం కాదు...చంపే రకం గుర్తు పెట్టుకో
-ఓరేయ్ ఇది పోలీస్ స్టేషన్....నీ అబ్బ జాగీర్ కాదు
-షేర్ ఖాన్ నేను చందాలు వసూలు చేసే టైపు కాదు...చమడలు ఒలిచే టైపు
-తెల్లారే సరికి నీ దందాలు, గుండా గిరీ ఆపేయ్...అలాగైతేనే ఫ్రెండ్ అవుతావ్ లేదా ఎండ్ అవుతావ్
-ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటే...పీకి చేతిలో పెడతా
రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.
ram charan teja amitabh bachchan zanjeer srihari priyanka chopra రామ్ చరణ్ తేజ్ జంజీర్ ప్రియాంక చోప్రా శ్రీహరి అమితాబ్ బచ్చన్


Click it and Unblock the Notifications
