క్లాస్ టైటిల్, మాస్ లుక్.... రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ (ఫస్ట్ లుక్)
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. 'వినయ విధేయ రామ' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో రామ్ చరణ్ పవర్ ఫుల్‌గా కనిపించారు. శత్రువులను వేటాడుతున్నట్లు ఉన్న రామ్ చరణ్ ఫోజు అభిమానులను ఆకట్టుకుంటోంది. డైరెక్టర్ బోయపాటి శ్రీను తన మాస్ మార్కుకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా తీశాడని స్పష్టమవుతోంది.
క్లాస్ టైటిల్... మాస్ లుక్
‘వినయ విధేయ రామ' అంటూ క్లాస్ టైటిల్ పెట్టిన బోయపాటి ఇందులో రామ్ చరణ్‌ను మాస్ లుక్‌తో ప్రజెంట్ చేశాడు. సినిమా ఎలా ఉండబోతోందో.... ఫస్ట్ లుక్ పోస్టర్లోనే కనపడేలా చేసి అభిమానుల్లో అంచనాలు పెంచారు.

రామ్ చరణ్ కెరీర్లోనే ది బెస్ట్ మాస్, యాక్షన్ మూవీ
రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను మించి పోయేలా మాస్, యాక్షన్ చిత్రంగా బయపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.

కీలక పాత్రల్లో...
వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తుండగా.... తమిళ నటుడు ప్రశాంత్, ఆర్యన్ రాజేశ్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చివరి దశలో షూటింగ్
దానయ్య మాట్లాడుతూ - ``రామ్‌చరణ్, బోయపాటి మూవీ మెగాభిమానులు, ప్రేక్షకుల అంచనాలను ధీటుగా సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా నవంబర్ 10 నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నవంబర్ 9 నుండే డబ్బింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications











