రాంచరణ్‌పై దారుణమైన ట్రోలింగ్, ఇక ఛాన్స్ లేదు.. వినయ విధేయ రామని ఏంచేశారంటే!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఈ ఏడాది ఆరంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన వినయ విధేయ రామ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. బోయపాటి దర్శత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా సంక్రాంతికి వినయ విధేయ రామ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. రొటీన్ కథ, కథనాలతో తెరకెక్కిన వినయ విధేయరామ అభిమానులకు కూడా రుచించలేదు. తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శిస్తున్నారు.

ఆ సీన్‌పై ట్రోలింగ్
వినయ విధేయ రామ చిత్రంలో రాంచరణ్ ట్రైన్ పై నిలబడి బీహార్ వెళ్లే సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశంపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. సినిమానే నిరాశపరిచిందనుకుంటే రాంచరణ్ పై జరిగిన ట్రోలింగ్ మెగా ఫాన్స్ ఇంకాస్త ఇబ్బందికి గురిచేసింది. ట్రోలింగ్ వలన జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన చిత్ర యూనిట్ కొన్ని రోజుల తర్వాత ట్రైన్ సీన్ ని తొలగించారు.

అమెజాన్ ప్రైమ్
తాజాగా వినయ విధేయ రామ చిత్రం డిజిటల్ మార్కెట్ లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో కూడా ట్రైన్ సన్నివేశాన్ని తొలగించారు. ఇకపై ట్రోలింగ్ కు ఆస్కారం లేకుండా ముందు జాగత్తగా ఆ సన్నివేశాన్ని తొలగించారు. ట్రైన్ సీన్ తో పాటు విమర్శలకు గురైన మరికొన్ని సన్నివేశాలని కూడా కట్ చేశారు. గత ఏడాది రంగస్థలం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రాంచరణ్ కు వినయ విధేయ రామ చిత్రం నిరాశనే మిగిల్చింది.

బయ్యర్లకు నష్టాలు
వినయ విధేయ రామ చిత్రం బయ్యర్లకు దాదాపు 30 కోట్ల వరకు నష్టాలని మిగిల్చింది. దీనితో బయ్యర్లకు నష్టపరిహారం అందించే బాధ్యతని నిర్మాత దానయ్య, రాంచరణ్ తీసుకున్నారు. రాంచరణ్ తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర రిజల్ట్ తో డీలా పడ్డ చిత్ర యూనిట్ కు పుండు మీద కారంలా వివాదాలు జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. నిర్మాత, దర్శకుడి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది.

ఆర్ఆర్ఆర్‌తో బిజీ
ఇదిలా ఉండగా ప్రస్తుతం రాంచరణ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రానికి కూడా దానయ్యే నిర్మాత. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని దానయ్య 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











