twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ: రాంచరణ్ మాస్, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది.. కానీ!

    |

    Recommended Video

    Vinaya Vidheya Rama Twitter Review : Mixed Talk From Fans | Filmibeat Telugu

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి కలయికలో వస్తున్న తొలి చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను ఎప్పటిలాగే ఈ చిత్రాన్ని కూడా ఫ్యామిలీ, మాస్ యాక్షన్ అంశాలతో రూపొందించాడు. ట్రైలర్ చూస్తే ఇదే అర్థం అవుతుంది. కైరా అద్వానీ ఈ చిత్రంలో రాంచరణ్ కు జోడిగా నటించింది. వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించాడు. స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. రాంచరణ్ రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత నటించిన చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు దేవిశ్రీ అందించిన సంగీతం.. రాంచరణ్, కైరా అద్వానీ స్టెప్పులు ఫ్యాన్స్ ని ఆకర్షించే విధంగా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా నేడు ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి. సోషల్ మీడియాలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం!

    ఫస్ట్ హాఫ్ కేక

    వినయ విధేయ రామ చిత్ర ఫస్ట్ హాఫ్ రిపోర్ట్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంది.

    సినిమాలో హైలైట్స్ ఇవే

    వినయ విధేయ రామ ఫస్ట్ హాఫ్ బావుంది. కానీ సెకండ్ హాఫ్ నిరాశపరిచింది. ఇది కేవలం మాస్ అభిమానులకు మాత్రమే నచ్చే యావరేజ్ చిత్రం. రాంచరణ్ నటన, ఫస్ట్ హాఫ్ లో సన్నివేశాలు, ఫైట్స్ ఈ చిత్రంలో ప్లస్ పాయింట్స్. స్టోరీ లేకపోవడం, బ్యాగ్రౌండ్ సంగీతం ఈ చిత్రంలో నెగిటివ్ అంశాలు.

    ఇంటర్వెల్ బ్యాంగ్.. మాస్

    వినయ విధేయ రామ ఫస్ట్ హాఫ్ పూర్తయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అందిరింది. మాస్ అంశాలు చాలా బావున్నాయి.

    కామెడీ వర్కౌట్ అయింది

    ఫస్ట్ హాఫ్ ముగిసింది.. రాంచరణ్ తన యాటిట్యూడ్, నటనతో అదరగొట్టాడు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. తస్సాదియ్యా సాంగ్, ఇంటెర్వెల్ సన్నివేశం చాలా బావున్నాయి.

    కేవలం అవి మాత్రమే

    ఇంటర్వెల్ ముందు ముఖేష్ రిషికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం, బీహార్ లో సెల్యూట్ సన్నివేశం తప్ప మిగతా అంతా నిరాశపరిచే విధంగా ఉంది. ఇంటర్వెల్ ఫైట్ కాస్త ఓవర్ గా ఉంది. దేవిశ్రీ సంగీతం కూడా ఆకట్టుకోలేదు.

    బోయపాటి సినిమాల్లో ఇప్పటి వరకు

    సెకండ్ హాఫ్ నిరాశాజనకంగా ఉంది. అన్ని రొటీన్ సన్నివేశాలు రూపొందించారు. బోయపాటి సినిమాల్లో ఇదే వీకెస్ట్ మూవీ ఇదే. వినయ విధేయ రామ డిజాస్టర్ మూవీ.

    హార్స్ రైడింగ్ సీన్స్

    రాంచరణ్ హార్స్ రైడింగ్ సీన్స్, వెనువెంటనే షర్ట్ లేకుండా వచ్చే ఫైట్ సన్నివేశం థియేటర్స్ లో పూనకాలు తెప్పించే విధంగా ఉంది. మీ చెవులు మోతెక్కడం ఖాయం.

    ఆ సీన్ ప్రత్యేకంగా

    వినయ విధేయ రామ చిత్రం ఊర మాస్ అనిపించే విధంగా ఉంది. యాక్షన్ సన్నివేశాల్లో రాంచరణ్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ అందించాడు. రామ్ కొణిదెల డైలాగ్ చెప్పే సన్నివేశం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

    నిరాశపరచే సంగీతం

    వినయ విధేయ రామ చిత్రంలో పాటలు, కామెడీ ఆకట్టుకునే విధంగా లేవు. బ్యాగ్రౌండ్ సంగీతాన్ని కూడా దేవిశ్రీ సరిగా అందించలేదు. ఇంటర్వెల్ బ్లాక్ అంతగా ఏమి లేదు. ఇక కథ గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు.

    ముస్లిమ్స్ ఫైట్

    రామ్ కొణిదెల ఎపిసోడ్ అదిరిపోయింది. రాంచరణ్ అద్భుతమైన ఫెర్ఫామెన్స్ అందించాడు. చిత్రంలో ముస్లిమ్స్ నేపథ్యంలో వచ్చే ఫైట్ సన్నివేశం చాలా బావుంది.

    English summary
    Ram Charan's VInaya Vidheya Rama Premier show talk and Twitter Review
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X