రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’... డిసెంబర్ 17న తస్సదియ్యా!
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్టెనర్ 'వినయ విధేయ రామ'. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షూటింగ్ పూర్తయింది కానీ ఇంకా రెండు పాటల చిత్రీకరణ మిగిలే ఉందట.
నిర్మాత దానయ్య మాట్లాడుతూ వినయవిధేయ రామ టాకీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. నేటి నుండి చిత్రీకరించబోయే షెడ్యూల్‌లో రెండు సాంగ్స్ షూట్ చేయబోతున్నాం. ఈ నెల 26 వరకు జరిగే ఈ పాటల చిత్రీకరణతో సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుంది'' అని తెలిపారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న రెండు పాటల్లో... ఒక స్పెషల్ సాంగ్‌ను కూడా ఉంది. ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ సోషల్ మీడియా, యూ ట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 17న తస్సదియ్యా... అనే సాంగ్‌ను కూడా విడుదల చేయబోతున్నామని తెలిపారు.
రామ్‌చరణ్, కియరా అద్వాని జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్‌రాజేష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మాటలు: యం.రత్నం, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబి, ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఫైట్స్: కనల్ కణ్ణన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్‌కుమార్, కో ప్రొడ్యూసర్: డి.కల్యాణ్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, దర్శకత్వం: బోయపాటి శ్రీను.


Click it and Unblock the Notifications











