ఇక్కడ 'రామ్..కొ.. ణి.. దె..ల'.. వినయ విధేయ రామ టీజర్.. మాస్‌లో మరో లెవల్!

Recommended Video

Vinaya Vidheya Rama Teaser ‘వినయ విధేయ రామ’ టీజర్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై తారాస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేశారు. తాజాగాటీజర్ కూడా విడుదలయింది. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కు విందు భోజనంలా కనిపిస్తోంది. టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

 భయపెట్టాలంటే 10 నిమిషాలు

భయపెట్టాలంటే 10 నిమిషాలు

భారీ ఇనుప రాడ్ ని రాంచరణ్ నెలకు రాస్తూ నడుచుకుంటూ వస్తుంటాడు. ఈ షాట్ తో టీజర్ మొదలవుతుంది. చరణ్ పూర్తిగా కనిపించాక పవర్ ఫుల్ డైలాగ్ వినిపిస్తుంది. అన్నాయ్.. వీడిని భయపెట్టాలా.. చంపేయాల.. భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే పావు గంట ఏదైనా ఒకే అని చరణ్ అంటాడు. అప్పుడే విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్ కూడా కనిపిస్తాడు.

స్టైలిష్‌గా

స్టైలిష్‌గా

రాంచరణ్ మాస్ లుక్ లో ఎంత పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడో.. కొన్ని షాట్స్ లో అంతకు మించి స్టైలిష్ గా కూడా కనిపిస్తున్నాడు. టీజర్ లో చూపినదాని ప్రకారం భారీ యాక్షన్ సన్నివేశాలకు బోయపాటి అంతా సెట్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రతి షాట్ రిచ్ గా కనిపిస్తోంది.

పందెం పరుశురాం అయితే ఏంట్రా

టీజర్ మధ్యలో పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టాడు. ఈ సన్నివేశం విలన్స్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ లా కనిపిస్తోంది. పందెం పరుశురాం అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్.. రామ్.. కొణిదెల అని బల్లగుద్ది రాంచరణ్ చెబుతాడు. ఈ డైలాగ్ మెగా ఫాన్స్ కు పండగ అని చెప్పొచ్చు.

 దేవిశ్రీ మ్యాజిక్

దేవిశ్రీ మ్యాజిక్

వినయ విధేయ రామ్ టీజర్ పూర్తి మాస్ అంశాలతో అదిరిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేవిశ్రీ అందించిన బ్యాగ్రౌండ్ సంగీతం ఈ టీజర్ కు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. కైరా అద్వానీ ఈ చిత్రంలో రాంచరణ్ కు జోడిగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X