twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివుడు డబ్బు కోరుకోడు.. 800 ఏళ్ల ఆలయాన్ని కడిగిన ఉపాసన

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన మహాశివరాత్రిని పురస్కరించుకొని దోమకొండ సంస్థానానికి చెందిన ఆలయాన్ని దర్శించుకొన్నారు.

    By Rajababu
    |

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన స్వచ్ఛంద కార్యక్రమాలే కాదు. దైవ కార్యక్రమాలంటే కూడా అమితమైన ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా ప్రముఖ ఆలయాలను దర్శించుకొంటారు. ఇటీవల వారి పూర్వీకులు దోమకొండ సంస్థానానికి సంబంధించిన అతి పురాతన ఆలయాన్ని దర్శించుకొన్నారు.

    మహా శివుడు విరాళాలు కోరుకోడు..

    మహా శివుడు విరాళాలు కోరుకోడు..

    ఓం నమశివాయ: దేవుడు విరాళాలు కోరుకోడు. ఆయన భక్తుల నుంచి భక్తి, శుభ్రతను కోరుకొంటారని రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని తెలిపారు. దయచేసి ఆలయాలను పవిత్రంగా ఉంచండి అంటూ వేడుకొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉపాసన 800 ఏళ్లు నాటి పురాతన ఆలయాన్ని దర్శించుకొన్నారు. దోమకొండ సంస్థానం నిర్మించిన ఆలయ విశిష్టతను తెలియచేశారు.

    800 ఏళ్ల నాటి పురాతన ఆలయంలో..

    800 ఏళ్ల నాటి పురాతన ఆలయంలో..

    మహాశివరాత్రిని పురస్కరించుకొని 800 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాన్ని పరిచయం చేయాలనుకొంటున్నాను. ఇది చాలా పవిత్రమైనంది. ఈ ఆలయం సమీపంలో మా పూర్వీకులు 400 ఏళ్ల క్రితం దోమకొండ కోటను నిర్మించారు.

    సమయం లభించినప్పుడల్లా దేవుడి..

    సమయం లభించినప్పుడల్లా దేవుడి..

    నాకు సమయం చిక్కినప్పుడల్లా ఈ ఆలయాన్ని దర్శించుకొంటాను. శుభ్రమైన నీటితో స్వయంగా నా చేతులతోనే కడుగుతాను. నా కోర్కెలు తీరాలని మొక్కు కొంటాను అని ఉపాసన తెలిపారు.

    మంత్రాలయంలో వైద్యశిబిరం

    మంత్రాలయంలో వైద్యశిబిరం

    దీనికంటే ముందు ఇటీవల మంత్రాలయంలోని రాఘవేంద్ర ఆలయాన్ని ఉపాసన దర్శించుకొన్నారు. రాఘవేంద్ర స్వామి మహిమను బలంగా విశ్వసిస్తాను. త్వరలోనే ఇక్కడ భక్తులు, స్థానికుల కోసం మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నాను అని ట్విట్టర్‌లో తెలిపారు.

    English summary
    Ram Charan's wife Upasana said Om namahshivay God doesn't need donation. he only expects devotion and cleanliness in his place of worship.Pls keep temples & surroundings clean
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X